అంతరంగ ఆలోచనలు
అలుపెరుగని ఆలోచన వీచికలకి
జీవిత సంద్రపు కన్నీటి అలలకి
అంతర్గత యుద్ధ కల్మషాలకి
చిరునవ్వు వెనుక దాగివున్న కర్కశానికి
నిజాయతి ముసుగులో అవినీతి వాగ్దాన వాక్కులకి
మదించిన మానవమృగాళ్ల వికృత చర్యలకి
జీవితసత్యమెరుగని పుస్తకమే లోకమాయె పసిమనస్సులకి
అంతరంగ ఆలోచనలు మధించే నా హృదయాన్ని…
ఆత్మ ఘోషించునేమో పరమాత్మ లో కలియుసమయంలో
– సూర్యాక్షరాలు