అంతరంగ మథనం

అంతరంగ మథనం

మనిషి నడవడికకు ఆయువుపట్టు అంతరంగ
ఆత్మ పరిశీలన మంత్రం!

ఆశపడే మనసుకి
ఆకర్షణలే ఆవహించిన
పలికే భావాల మాటలు
నిరంతర పర్యవేక్షణలో
మూగ భాషల అంతరంగ
మథనం

నిక్షిప్త సందేశాల యాతనలో
తప్పు ఒప్పుల తర్కంలో
వెలితి మర్మాల వేదనలో
గతి తప్పిన మనసుకు
గాడి లోకి తెచ్చేది అంతరంగ
మథనం

హితమే తెలియని సమరంలో
చేజారిన చేష్టలకు నిలువెత్తు
సాక్షిగా నిన్ను చూపును
నిదర్శనంగా అదే అంతరంగ
మథనం

రాత్రి పగలు వలె మంచి – చెడుల హృదయాంతరాల
పరీక్షలు మనిషికి
అవే అవకాశ మిచ్చును
పురోగతికి ఆవిష్కరణ వంటివి

అంతరంగ మథనం అద్భుత
ఫలితాలనిచ్చును మనకు
క్షీరసాగర మథనం వలె …….?

– జి జయ

Related Posts