అంతర్లీన కళ
ఒకరి పై కలిగే..
అంతర్లీన భావోద్వేగాలను..
గుండెల్లో దాచుకోవడమే..
ఒక కళ..
అదీ అక్షరాల రూపంలో..
దాచుకోవడం ఇంకో కళ..
మనుషులు బాధ..
పెట్టినప్పుడు..
ఆ బాధలోనే మన మేధ..
వికసించి..
అంతర్లీన అక్షర కళ..
బయట పడుతుంది..
మనసులో రగిలే బాధ..
జ్యోతిలా వెలిగి..
దేదీప్యమానమైన వెలుగుతో..
ఎవరూ ఊహించని విధంగా..
అక్షర కళ కళ కళ లాడుతుంది..
బాధను పంచుకునే అక్షరమా..
అధ్బుత అవకాశమా,,
ఓదార్పు లభించే అంతర్లీన..
అక్షరమా! నీకు నా జోహారు..
నాతోనే ఉండు ఎప్పుడూ!!
ఎల్లప్పుడూ!!
-ఉమాదేవి ఎర్రం