అంతిమయాత్ర

అంతిమయాత్ర

ఊరు దూరం కాటి దగ్గర
అంటారు కదా మరి
జనన మరణాల ఆత్మ
డోలాయ మాన మార్గం
ఆయుష్షు తీరి ఎవరి కోసం
ఎదురుచూడని దారి అది
విగత జీవికి మనం ఇచ్చే
చివరి నీరాజనం
సృష్టిలో జీవిత సమరం

ముగిసి కనుమరుగు కు
ప్రయాణం అది
వొంటరిగా వచ్చి వొంటరిగా
వెళ్ళే పాదయాత్ర
నీ వాళ్ళు అనుకునే వారికి
హృదయ ఘోష అది
చేతనత్వాన్ని వదిలి
పంచభూతాల సన్నిధికి
చేరే అనంత లోకాల
అంతిమయాత్ర అది….

-జి. జయ

Related Posts