అను.. బంధాలు

అను.. బంధాలు

అను.. బంధాలు

గుండె లోపలి పొరల్లో ఇంకా ఇంకిపోని తడేదో అప్పుడప్పుడు కంటి కొలకుల్లో మంచు ముత్యమై మెరుస్తుంది-

వారాంతాల్లో వచ్చే మొక్కుబడి పలరింపుల మధ్య వారి ఒడిలిన పెదాలపై హరివిల్లొకటి విరుగుతుంది –

నది నెట్టేసిన చేపల్లా అమ్మ కనిపించని పాపల్లా నిలువెల్లా మూర్తీభవించిన స్తబ్ద చైతన్యాలు వాళ్ళు –

వెచ్చని వుదయాల్ని నిర్వికారంగా చూస్తూ ఒరుగుతున్న ఆకాశాన్ని శ్రద్ధగా చదువుకుంటున విద్యార్దుల వాళ్ళు –

చేరక తప్పని మజిలీ లో గమ్యం జేర్చే రైలు కోసం ఎదురు చూస్తున్న ప్రయాణీకులు వాళ్లు

వాళ్ళని బ్రతికిస్తున్నది. గుప్పెడు మెతుకులు కాదు, దాచుకున్న గతం లోంచి తోడుకుని తాగుతున్న గుక్కెడు జ్ఞాపకాలు మాత్రమే!!! ఎందరో అమ్మ నాన్నలకు…

-గురువర్ధన్ రెడ్డి

రివాజు Previous post రివాజు
ఆయుధం Next post ఆయుధం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close