అనుభవాల దాహంతో
ఎవరికి వినిపించకు…
నీ ఆత్మ శ్రియాతత్త్వాన్ని మనిషివై మననం చేసుకో… ప్రకృతికి కాచిన నిశ్శబ్దపు
విప్లవం ప్రతి మనస్సుని వేదికగా చేసుకొని
ఇలవైభవంగా…. పూలబంతుల ప్రభల
చిహ్నాలతో వసంతాల పూర్ణిమను పూయిస్తు
ఏడాదిలో చిగురించిన షడ్రుచులను
రంగరించుటకు వస్తుంది…
జీవితపు ప్రయాణము ఎన్నో రుచుల
సమ్మేళనము… మరెన్నో మలుపుల
సంఘమము నిజం తెలిసిన హృదయంతో
చీకటి వేదనకు వెలుగును నింపుతు…
నేటి తరం ఒకరికొరకు నడిచేది కాదని
ధైర్యమున్న ఆసక్తితో పదిమంది మానవతా
మూర్తులు నడిచిన మూర్తీభావం కావాలని
నిన్ను నీవుగా నిరూపణలతో ఏకమై నిలుచు
కొండా కోనలు చిగురుటాకులతో
తోరణాలతో కడుతున్నవి… చిలక పలుకుల
జోష్యమై తొలిపొద్దు సంబరంగా పిలిచిన
ఉగాదిని కొమ్మా కొమ్మన కోయిలమ్మ వసంత
రాగాలతో స్వాగతం పలుకుచున్నవి…
పులకరించిన పరువాలు పూచే తత్త్వమై
తలాన పూచిన వారసత్వం అవనికి
కిరీటమై… తెలుగుచ్ఛాయల చల్లధనపు
ఉగాది పర్వదినం అందరి మనస్సులలో
ఆహ్లాదాన్ని పంచుటకు…..
హరివిల్లుల రంగులతో లోకం మబ్బులను
పూయిస్తు… ప్రతి రంగులోని పరమార్థాన్ని
తెలుపుతు… తొనలు పగిలిన మకరందముతో
నిరంతరం నీదేనని…. అనుభవాల దాహంతో
తడిసిన నాలుకకు రుచుల వర్ణనలతో
బతికేదే హితువని భోదిస్తు ఆశా జీవితాలకు
ఉషెస్సై…. వేకువకు ఉషోదయమై
తెలవారుతున్నది ఉగాదిగా….
– దేరంగుల భైరవ