అనుభవం

అనుభవం

ఈరోజు అక్షరలిపి వాళ్లు ఇచ్చిన అంశానికి నా కథ అనుభవం.

అవి నేను కొత్తగా ఉద్యోగం లో చేరిన రోజులు. కొన్ని విషయాలను మర్చిపోవాలంటే ఇంకో పని వెతుక్కోవాలి అని పని వెతికాను. అప్పుడు నాకు పేపర్ లో ఉద్యోగం గురించి తెలిసి అప్లై చేశాను. వెంటనే రమ్మని అన్నారు. దాంతో వెళ్ళాను.

ఆఫీస్ హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లో పొద్దున్నే బస్ కి వెళ్ళాం మా నాన్నగారు కూడా తోడు గా వచ్చారు. మొదటి రోజు కాబట్టి అక్కడికి వెళ్ళాక వాళ్ళు పది రోజులు ట్రైనింగ్ ఉంటుంది అన్నారు. రోజూ రావాలని అది కూడా పది గంటల లోపు రావాలని అన్నారు. సరే అని చెప్పి తిరిగి వచ్చేశాము.

ఇక తెల్లారి నుండి నా పాట్లు మొదలు అయ్యాయి. అయిదు గంటలకు లేచి వంట చేసుకుని, టిఫిన్ కట్టుకుని ఏడు గంటల వరకు బస్ స్టాండ్ లోకి వచ్చాను. అప్పటికి బస్ లు చాలా తక్కువగా నడిచేవి. ఏడు గంటలకు రావాల్సిన బస్ ఎనిమిది గంటలకు వచ్చింది.

అది నెమ్మదిగా వెళ్లడం వల్ల రెండు గంటలు పట్టింది. మళ్ళీ నేను బాలానగర్ లో దిగి, సికింద్రాబాద్ బస్ ఎక్కి ఆఫీస్ కి వెళ్ళేసరికి పదకొండున్నర అప్పటికి అందరూ వచ్చేసి, ట్రైనింగ్ స్టార్ట్ అయింది.

నేను రావడం ఆలస్యం కావడం వల్ల మా బాస్ నన్ను కింద నుండి పైకి ఎగాదిగా ఒక్క చూపు చూసారు. ఇంకేం అనలేక నేను బిత్తర చూపులు చూడ సాగాను.🙄

అలా నా మొదటి కాదు రెండో ఉద్యోగం ఊడి పోయింది. ఇదండీ నా ఉద్యోగ అనుభవం. ఆర్టీసీ బస్ ల పై వేసే జోకులు నిజమని అప్పుడే నాకు తెలిసింది. మీకు ఇలాంటి అనుభవాలు ఉన్నాయా హా ఉండే ఉంటాయి లేండి. కాస్త నాకు చెబుదురూ క్యామిడి గా😂😂😂😂😂

-భవ్య చారు

Previous post ఈరోజు అంశం:- అనుభవం
Next post గోత్రం అంటే ఏమిటి?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *