అనుభూతి

అనుభూతి

జన్మ నిచ్చింది మొదలు
గుండె వెచ్చని వూసులతో
అనుభూతుల ఆరంభం

అనుభూతుల సమాహారం
ఆది అంతపు సయ్యాట
మానవ జన్మ ఊగిసలాట

మనస్సును మైమరపించే ఒక తలంపు అనుభూతి
అదే
ప్రేమ ఒక మధురానుభూతి
అనుభందం అనుభూతి
అనురాగాల అనుభూతి
సంతోషం ఒక అనుభూతి
సాహసం ఒక అనుభూతి
ఆలోచన ఒక అనుభూతి
అనుభవం ఒక అనుభూతి
బాధ ఒక అనుభూతి
చెలిమి ఒక అనుభూతి
సాంగత్యం ఒక అనుభూతి
భరించడం ఒక అనుభూతి
తీపి స్మృతులు ఒక అనుభూతి
ప్రయాణం ఒక అనుభూతి
పారవశ్యం ఒక అనుభూతి
సందేహం ఒక అనుభూతి
సందర్భం ఒక అనుభూతి
అస్వాదన ఒక అనుభూతి
ఆలకింపు ఒక అనుభూతి
ఒకరి స్పర్శ ఒక అనుభూతి
దృశ్యం ఒక అనుభూతి
రూపం ఒక అద్భుత అనుభూతి
అన్నింటినీ మించిన
అనుభూతి ఇవ్వడం
భగవత్ నామం మహత్తర
అనుభూతి
మనం చేసే ప్రతి పని ఒక అనుభూతుల సరిగమలు
అదే పరిపూర్ణ జీవిత రహస్యం…….

– జి జయ

Related Posts