అనురాగ సంగమం

అనురాగ సంగమం

జగములోన

ప్రేమకు లోటు లేదు

మురిపించ వచ్చు

అనురాగాల ఒడిలో

ప్రణయ గీతాల జడిలో

పారవశ్యపు మదిలో

తనువున తనువై

బ్రతుకు జతయై

తోడు నీడలా

మనసిచ్చిన మనువుతో

మదిమెచ్చిన ఊహతో

అనుబంధాలఅంత్యాక్షరి

ఎడబాటు లేక

సరాగాల సవ్వడిలో

వెన్నెల పల్లకీలో

జతయై చేరిన పొదరింట్లో

సంతోషాల సంగమంలో

దూరమెరుగని మమతను

ఆపేక్షల అంతరంగం లో

సమస్తం మరచి

నిర్మలత్వపు సొగసులతో

సంసార సాగరంలో

ప్రియమైన వారితో

అనురాగ సంగమంలా

ఉబలాట పడుతూ

జీవన తరంగాల లో

మురిసి మెరవాలి
అన్నీ వారై ఉంటారనుకుని
అదే జగత్తు గమ్మత్తు…..?

– జి జయ

Related Posts