అపాత్ర సాయం అనర్ధం
ఏమేవ్,వాకిట్లోకి బిచ్చగాడు వచ్చాడు.అన్నం ఏదైనా ఉంటే పెట్టవే అన్నాడు రామనాధం.
ఇప్పటి బిచ్చగాళ్లు మన అన్నాలు ,సున్నాలు అక్కరలేదండీ,పొడి రూపాయలు కావాలి.అవ్వైతేనే తీసుకుంటారు వాళ్ళు అంటూ వంటింట్లోంచి గావుకేక పెట్టింది కాంతం.
పోనీలేవే,ఒక పదిరూపాయలు నేనిచ్చి పంపిస్తున్నానులే.మనం ఎవరికైనా సాయం చేస్తే భగవంతుడు మనకు పదింతల సాయం చేస్తాడే
ఇది భగవద్గీత లో కూడా పరమాత్మ చెప్పాడు కదా
అన్నాడు రామనాధం.
పరమాత్మ సాయం చేయటం అటుంచి,వీళ్లు
లక్షాధికారులై,వీధులు,ఊర్లు పంచుకుంటున్నారండీ.
మీరు ఎప్పుడో బీ సీ కాలం
మనిషి అంది కాంతం.
అపాత్ర సాయం చేయకూడదండి.మనం చేసే సాయం ఎదుటివారికి
సరిగా ఉపయోగపడినపుడే ఆ సాయానికి విలువ.కష్టాలలో ఉన్నవారికి తప్పని సరిగా సాయం చేద్దాం.
చౌటుప్పల్ లో అనాధాశ్రమం ఉంది.అక్కడకెళ్ళి నా చీరలు,బియ్యము,పప్పు ఉప్పుడు ఇచ్చి వద్దా అంది
కాంతం.
సరే,నువ్వు చెప్పినది బాగుందే.అలాగే చేద్దాములే అన్నాడు రామనాధం.
సో, సపాత్ర సాయం చెయ్యండి.వారు నిజంగా
కష్టాల్లో ఉంటే మీ సాయం
వారికి ఉపయోగపడుతుంది.అందరినీ మనమెక్కడ చూడగలం అంటారా?! వారి ఖర్మ వాళ్ళది.
– రుద్రపాక సామ్రాజ్య లక్ష్మి