అపార్ట్మెంట్లో గోల

అపార్ట్మెంట్లో గోల

అపార్ట్మెంట్లో గోల

అపార్ట్మెంట్లో మంకీస్ ఉన్నాయి. మీరు విన్నది నిజమే🙂.బాబూజీ ఒక అపార్ట్మెంట్లో ఉండేవాడు. ఆయన అపార్ట్మెంట్ పక్కనే ఉన్న అపార్ట్మెంట్లో మంకీస్ అని తమను తాము పిలుచుకునే బ్యాచులర్ మ్యూజిక్ ట్రూప్ ఉంటున్నారు. రాత్రి అయితే చాలు రచ్చ రచ్చ చేస్తారు.బాగా తాగేసి డాన్స్ చేస్తూ స్పీకర్లు ఫుల్ సౌండ్ పెట్టి డాన్స్ చేస్తుంటారు. మధ్యమధ్యలో బయటకు వచ్చి తాగిన మైకంలో పక్క అపార్ట్మెంట్ వారితలుపులు కొడుతూ రచ్చ రచ్చ చేసేవారు.

అపార్ట్మెంట్ అంతా పీకి పందిరేసి ఎప్పుడో తెల్లవారుజామున పడుకుంటారు. ఇది బాబురావుకి ఎంత ఇబ్బందిగా ఉంది.వారికి అనేక సార్లు చెప్పి చూశాడు. మంకీస్ ట్రూప్ వాళ్ళు ఏ మాత్రం వినటం లేదు. ఆ అపార్ట్మెంట్ ఓనరుకూడా బ్యాచిలర్. అతను ఆ మంకీస్ ట్రూపులో ఒక మంకీ. అందువల్ల వారు ఎవరికి భయపడటం లేదు. వారు తమమ్యూజిక్ తో బాబూరావు కుక్కని కూడా భయపెట్టేసారు.అది అపార్ట్మెంట్ బయటకు రావాలన్నా భయపడుతోంది.

మంకీస్ మ్యూజిక్ దెబ్బకిఆ వీధిలోని వీధి కుక్కలన్నీపరారయ్యాయి. ఆ అపార్ట్మెంట్లో ఉండే పిల్లలు కూడా ఆ ఫ్లోరుకు రావాలంటేజంకుతున్నారు. ఆ మ్యూజిక్ వినలేక బాబురావుతో పాటు అక్కడ నివాసం ఉండే అపార్ట్మెంట్ వారు ఒక ప్లాన్ వేశారు. మంకీస్ ట్రూప్ రాత్రంతా ఎంజాయ్ చేసితెల్లవారు జామున పడుకుంటారు. ఆ సమయంలో బాబూరావు స్పీకర్లు పెట్టి పెద్ద సౌండ్ తో డేంజరస్ పాట పెట్టాడు.మంకీస్ బయటకు వచ్చి గొడవ చేశారు. “మేము పడుకునే సమయం లో మీరు ఇలా మ్యూజిక్ పెడితే ఎలా” అని అడిగారు.

అప్పుడు బాబురావు “రాత్రిపూట మేము పడుకునే సమయంలో మీరుమ్యూజిక్ పెట్టి రచ్చ రచ్చ చేస్తున్నారు. ఆ విషయం మీరు గుర్తించడం లేదు.మీరు ఎంజాయ్ చేస్తున్నారు గాని ఇక్కడ ఎంత మంది ఇబ్బంది పడుతున్నారో మీరు గుర్తించడం లేదు. మీరు తెల్లవారుజామున పడుకుంటారు కాబట్టి మీకు నిద్ర సరిపోతుంది. మేము ఉద్యోగం చేసే వాళ్ళం. రాత్రి పడుకుని ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్తాము.

మీరు అలా చేస్తే మేము ఇలా చేస్తాము. మేమూ ఒకప్పుడు బ్యచిలర్స్ మే బాబూ. మేం తలుచుకుంటే మీ పని గోవిందా.”అని అన్నారు.బాబూరావు మాటలు విని బ్యాచులర్స్ అంతా అవాక్కయ్యారు. బాబురావు చెప్పింది నిజమే అని వారికి అర్థమైంది ఎంతైనా ఇది క్లబ్బు కాదు కదా. అపార్ట్మెంట్స్ కాబట్టి చాలా ఫ్యామిలీస్ ఉంటాయి. వారిని డిస్టర్బ్ చేయటం తప్పు అనే విషయం వారికి అర్థమైంది. అంతే దెబ్బకు దెయ్యాలు దిగివచ్చాయి. ఇక ప్రతిరోజూ రాత్రి అంతా సైలెన్స్. అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు.

 

-వెంకట భానుప్రసాద్ చలసాని

దయ్యం Previous post దయ్యం
అర్థరాత్రి మద్దెల దరువు (1) Next post అర్థరాత్రి మద్దెల దరువు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close