అపూర్వం

అపూర్వం

పుట్టడం అపూర్వం
పెరగడం అపూర్వం
చిన్ని పాదాలు కందకుండా
పెంచడం అపూర్వం
ఏ గాలి ధూళి సోకకుండా
కాపాడుకోవడం అపూర్వం
పలకా బలపం పట్టడం అపూర్వం
చేతి రాతలు అపూర్వం
చదివే తరగతి లో మొదటగా
నిలవడం అపూర్వం .
ఆశలు చిగురులు వేయడం అపూర్వం
ఆ ఆశలు తీరడం అపూర్వం
అనుకున్న దాన్ని సాధిస్తే అపూర్వం
తొలి ప్రేమ అపూర్వం
పెళ్లి అపూర్వం ,తిరిగి మనకు పిల్లలు
కలగడం అపూర్వం.

ఆడపిల్ల అయితే …

అమె జననం అపూర్వ ఆనందం
ఆనందం చిన్ని నవ్వు అపూర్వం
లేత పాదాలు, చిన్ని అడుగులు
చిట్టి గాజులు చిన్ని మాటలు అపూర్వం
ఆమె పెంపకం అపూర్వం ఆమె ఎదుగుదల అపూర్వం
ఆమె నవ్వు , ఆమె చేతలు ఒక అపురూపం
ఆమె వేడుకలు ఆనందం .
ఆమె తల్లి అయ్యే క్షణాలు అపూర్వం
ఆ చిన్ని తల్లికి అధ్భుతమైన క్షణాలు
తన ప్రాణాలు పణంగా పెట్టే ఆ క్షణం అపూర్వం
తన సంతోష ఆనందకర జన్మ అపూర్వం..
మరు జన్మ అపూర్వం ….
ఈ చిన్ని జీవితం లో
అనంతమైన , అపూర్వ క్షణాలు ఎన్నో …
అంతఅపూర్వమైన ఆనంద క్షణాలను
ఆస్వాదిస్తూ …. ఆనందం అపూర్వం

– భవ్యచారు

Previous post లిఫ్ట్ -కథానిక
Next post మౌనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *