అపూర్వము

అపూర్వము

అపూర్వమా రాముని జననం
పాయస సేవనమున కౌసల్యా సుతుడయ్యె కదా!

అపూర్వమా భద్రుని విద్యాభ్యాసం
రాక్షస సంహారమే అతడికి ప్రత్యక్ష పాఠం!

అపూర్వమా అరవిందనేత్రుని కల్యాణం
శివధనసు విరిచి జానకి చేపట్టె కదా!

అపూర్వమా రాఘవుని పితృవాక్య పరిపాలన
క్షణమున రాజ్యము త్యజించి కానలకేగె కదా!

అపూర్వము అహల్యా శాపవిమొచనము
అపూర్వము సీతాపహరణము
అపూర్వము వానర సంయోగము
అపూర్వము రామసేతు నిర్మాణము
అపూర్వము రావణ వధయున్

రామచరితమద్భుతము
తలచినంతనే పుణ్యము

జై శ్రీరాం!

– రాజేష్ చక్రవర్తి

Related Posts