అరణ్య రోదన

అరణ్య రోదన

అరుగు కాళ్ళిచ్చె
నాకు పిసరంత
ఆనందం……..!

అడవులందు వినవచ్చె
వెదికిన అరణ్య రోదన.

నదీమ తల్లి
ఆవిరై ఎండంగ
రాలు కన్నీరు
ఇంకె వరదలై………!

మూగ జీవలు
మౌనం వీడి
ఆర్తనాదాల
నాదస్వరం తో లోక
కళ్యాణం చేయుచుండె.

జంతు కోటలని
కొల్లగొట్టి మానవ
మృగాలు సంచరించుచుండె.

అరుగు కాళ్లిచ్చె
నాకు పిసరంత
ఆనందం………..

విశ్రాంతి కోరి
నా శరీరము కాస్త
విశ్రమించె …….!

వినవొచ్చె నాకు
పసికందు కేరింతలు…!
దొరికెనానందము ఇక
విశ్రమించ………………!

ఆనందం భాష్పాలు
రంకెలేయ………..!
విశ్వమంతయు
మారుమ్రోగె………..!

ఇట్లుందును,
ఇట్లుందును ఇకపై
దొరికె నాకు
అనంద సామ్రాజ్యము…..!

– వాసు

Related Posts