అర్ధరాత్రి

అర్ధరాత్రి

అర్ధరాత్రి, కొందరికి అంతరంగం మేలుకునే సమయాలు.
భావాలను, భావోద్వేగాలను పూర్తిగా నిద్ర లేపే క్షణాలు.
అందని వాటిని ఎన్నో అందించుకునే
ఊహల ప్రపంచంలోకి తీసుకుపోయే ఘడియలు.
కొందరికి ఆనంద ప్రపంచాన్ని అందిస్తుంది.
కొందరికి అవేదన పరిచయం అవుతుంది.
ఒంటరితనానికి అర్ధరాత్రి  ఒక నరకం.
ఏకాంతానికి ఒక  తియ్యని అనుభవం.
అర్ధరాత్రి నడక భయం. ఆలోచనలు అపడం కష్టం.
ఆ సమయంలో వచ్చే ఆలోచనలను సరైన రీతిలో నడిపిస్తే,
జీవితం విజయాల మయం. 
అన్నీ సమయాలు ఏదో ఒక పరిస్థితితో పోరాడే మనిషి,
అర్ధరాత్రి తన అంతరంగ స్థితితో పోరాడాలి.
అప్పుడు, అక్కడ ఆ స్థితిని అధిగమిస్తేనే,
ఉదయపు సూర్యుని కిరణాల వెలుగును
గర్వంగా చూడగలుగుతాడు మనిషి.
– రాధిక.బడేటి

Related Posts