అర్ధనారీశ్వర తత్వం అంటే

అర్ధనారీశ్వర తత్వం అంటే

అర్ధనారీశ్వర తత్వం అంటే
మనుషులు రెండుగా
శరీరాలు రెండుగా
మనసులుచేసే ఆలోచన ఒకటిగా నడవడం!
అన్యోన్యతనే ఆది మంత్రమై
ప్రాణమైన ప్రాణ సఖి అయినా
శక్తి అయినా యుక్తి అయినా
సౌభాగ్యమైనా సంపద అయినా
రుణబంధమైనా ఆనందమైనా
అలవాటైనా పొరపాటైనా
బరువైనా బాధ్యతైనా
బుద్ధి అయినా శుద్ధి అయినా
కీర్తి అయినా అపకీర్తి అయినా
రక్షణ అయినా శిక్షణ అయినా
స్వీయమైనా హేయమైనా
కర్మమైనా ఫలితమైనా
బలమైనా బలహీనత అయినా
అవకాశం అయినా ఆధిపత్యమైనా
ఊహైనా నమ్మకమైనా
సఫలమైనా విఫలమైనా
మతమైనా మార్గమైనా
ప్రయోజనమైనా
పంతమైనాపరమార్థం ఏదైనా
సూక్ష్మమైనా మోక్షం అయినా
శుభాశుభాలు ఏవైనా
గెలుపైనా ఓటమైనా
జీవనమైనాజీవితమైనా
అవరోహనైనా ఆరోహనైనా
ఆత్మ పరమాత్మల రూపమై లోకంలో
అన్యోన్య దాంపత్యానికి అందమైన అర్ధనారీశ్వర రూపమే అందుకు మన ముందున్న సాక్షాత్కారం కాదా మరి ……?

– జి జయ

Related Posts