అరిషడ్వర్గాలు అవసరమే

అరిషడ్వర్గాలు అవసరమే

మనిషిలో ఆరు అరిషడ్వర్గాలు ఉంటాయి. మనలో ఉండే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలే ఈ అరిషడ్వర్గాలు. ఇవన్నీ మనిషికి అవసరమైనవే. వీటిని అదుపులో పెట్టుకున్న మనిషిని మహనీయుడు అంటారు. గృహస్థాశ్రమంలో భార్యాభర్తల నడుమ ప్రేమతో పాటు ఒకరి పట్ల ఒకరికి కామ వాంఛ లేకున్న ఎడల కాపురం నిలబడదు. అలాగే మనవారిని సరైన దారిలో పెట్టాలంటే క్రోధం అవసరమే.

అలాగే కుటుంబం బాగుండాలని అనుకుని ఆ కుటుంబం కోసం డబ్బులు సంపాదించాలనుకోవటం, ఆ డబ్బులు భవిష్యత్తు అవసరాలకోసం దాచడం లోభం కాదు. ఇలా మనలో ఉన్న అరిషడ్వర్గాలను కనుక అదుపులో ఉంచుకుని తగిన రీతిగా వాటిని వాడుకుంటే మేలే కానీ కీడు జరుగదు.

అరిషడ్వర్గాలను జయించిన పరమశివుడు కూడా తనపై మన్మధుడు పూలబాణం వేశాడనే క్రోధంతో అతన్ని తన మూడవ కన్ను తెరిచి భస్మం చేసాడు. అలాగే తపస్సు చేస్తున్న మహర్షి విశ్వామిత్రుడు కూడా మేనక రాకతో తపస్సు చాలించి మోహావేశంతో ఆమె దరికి చేరాడు. అశ్వమేధయాగం చేసి ఒక మహాసామ్రాజ్యం స్ధాపించాలనుకున్న ధర్మరాజుది లోభం కాదు సుమా.

ఆ యాగం శ్రీకృష్ణుడు దగ్గరుండి జరిపించాడు. శ్రీ రాముని కాలంలో కూడా అశ్వమేధ యాగం జరిగింది. రాజ్యం వీర భోజ్యం. వీరులైన వారు రాజ్య విస్తరణ కోసం ఇతరుల రాజ్యాలను జయించే వారు. అది లోభం కాదు సుమా. ఏదిఏమైనా అరిషడ్వర్గాలను జయించడం మానేసి వాటిని సరిగా వాడుకుంటే జయం కలుగుతుంది.

– వెంకట భానుప్రసాద్ చలసాని

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *