అసలు కవిత అంటే…?

అసలు కవిత అంటే…?

అక్షరాలనే అమ్మా-నాన్నలకు,
పదాలవంటి పిల్లలు పుట్టి,
వాక్యాలు వారసులుగా నిలబడి,
భావాల బాధ్యతలను నెరవేరుస్తూ….

కలలో కనిపించిన కమ్మని నిజాన్ని,
ఖచ్చితమైన నిజంచేసి,
“కవితాఖనిజం” గా వెలుగొందుతూవుంటుంది!

కవిత అంటే ఈ విధంగా ఉండాలి

క…..కలలో కనిపించే కధలావుండాలి.
వి….విపులంగా విశదీకరించే వివరణవుండాలి
త….తనువంతా తన్మయత్వంతో తరింపజేయాలి….

– గురువర్ధన్ రెడ్డి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress