ఆశాజ్యోతి

ఆశాజ్యోతి

సాంబశివరావు, సరోజా దంపతులకు ముగ్గురు కూతుళ్లు. సాంబశివరావు చిన్న వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని నెట్టు కోస్తున్నాడు. తల్లి సరోజ చాలా ఓర్పు గల మనిషి. ఇద్దరి కూతుళ్లని ఆడపడుచుల కొడుకులకు ఇచ్చి పెళ్లి చేశారు. అన్న,వదిన పరిస్థితి చూసి ప్రేమతో పైసా కట్నం అడగకుండానే పెళ్లి చేసుకున్నారు. చిన్న బిడ్డ ఉమకి ఆరోగ్యం బాగుండదు. ఉమకి గుండెలో హోల్ వుందని, పరీక్ష చేసిన డాక్టర్ చెప్పాడు. తల్లిదండ్రులకి, అంత డబ్బు ఖర్చు పెట్టే స్తోమత లేక మందులతోనే ఆమె ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. 

ఉమ చదువులో ఫస్ట్ ఉండేది. ఆమె తెలివితేటల వలన ఆమెకు మంచి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఆ జాబ్ వలన ఆమె గుండె ఆపరేషన్ చేయించుకుంది. డాక్టర్ ఇచ్చిన సలహా ప్రకారం పెళ్లి చేసుకోవచ్చు. కాని పిల్లలను కంటేనే ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పాడు. రమేష్ వాళ్ళ బంధువుల అబ్బాయి. ఆమె ఆరోగ్యం సంగతి తెలిసి కూడా ఇష్టపడి ఒప్పుకోని ఉమని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు ఉద్యోగస్తులు. రోజూ పొద్దున్నే వెళ్లి సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి చేరుతారు.

కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఇద్దరికి పిల్లలు లేరని దిగులు ఎక్కువగా వుండేది. ఒకరోజు ఉమ భర్త రమేష్ తో ఏమండి, మనం మన చుట్టాలలో ఎవరినైనా అడిగి, అప్పుడే పుట్టిన బిడ్డను దత్తత తెచ్చుకుందామా? అని అడిగింది. నాకు అలాగే అనిపిస్తుంది అని అన్నాడు. మా చిన్నమ్మ ద్వారా తెలిసింది. తన కూతురు జ్యోతి. ఆపరేషన్ చేయించుకున్న మరల గర్బవతి అయిందని తనని అడుగుదామా? అంది. సరే నీ ఇష్టం అన్నాడు. జ్యోతికి మొదట కవల పిల్లలు ఒక మగబిడ్డ, ఒక ఆడబిడ్డ వున్నారు. అందుకే ఇప్పుడు పుట్టబోయే బిడ్డను తప్పక మనకు ఇస్తుందండి అంది. సరే అయితే ఈ ఆదివారం ఫోన్ చేయి వెళ్దాం  అన్నాడు.

ఒక ఆదివారం ఉమ, జ్యోతికి ఫోన్ చేసి వస్తున్నామని చెప్పి ఇద్దరు వెళ్ళారు. ఆమె చాలా సంతోషపడింది. అబ్బా అక్క, బావ పెళ్లి అయిన ఇన్నినాళ్లకు, మా ఇల్లు గుర్తుకు వచ్చింది అంది. స్వీట్ చేసి పెట్టింది. ఎందుకు జ్యోతి ఇప్పుడు ఇవి అన్ని, నువ్వు వటి మనిషి కూడా కాదు. నాకు ఏం ఇబ్బంది కాదు. మీరు రావడమే నాకు చాలా సంతోషం అంది. ఉమ తీసుకెళ్లిన పండ్లు స్వీట్, జ్యోతికి ఇచ్చి, వచ్చిన విషయం చెప్పారు‌.

అప్పుడే వచ్చిన జ్యోతి భర్త వివేక్ కూడ ఆ విషయం విన్నాడు. సారీ అండి ఏమి అనుకోవద్దు. మాకు ఈ బిడ్డను ఇవ్వడం ఇష్టం లేదు అన్నాడు. అన్నయ్య నాకు ఇప్పటికి ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా ఇంకో బిడ్డను ఎలా వదులుకుంటాను. నాకు తెలుసు మీరు బాగా చూసుకుంటారని, కాని నా మనసు అందుకు అంగీకరించడం లేదు అంది. ఏమి అనుకోవద్దు అని మరి మరి చెప్పింది. ఓకే దాని దేముంది. ఏం ఫర్వాలేదు లేదు. అని చెప్పి ఇంటికి వచ్చేశారు. 

రమేష్ తమ్ముడికి ఇద్దరు పిల్లలు. అందుకే ఉమ తన తోటి కోడలుతో మా కోసం మూడో బిడ్డను ప్లాన్ చేసుకోమని చెప్పింది. ఆమెకి ఇద్దరి పిల్లలకి రెండు సిజరిన్సు అయినవి. అక్క, నా ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి కదా! మూడో బిడ్డ పుట్టితే మూడో సిజరిన్ నేను తట్టుకోగలనా? నన్ను క్షమించు అక్క అంది. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా ఆయననే చేయించుకోమని చెప్పాను అంది. ఉమకి తోటికోడలు చెప్పిన మాటలు నిజమే అనిపించాయి. ఆ విషయం రమేష్ కి చెప్పింది.

ఉమ, రమేష్ ల ప్రయత్నం ఇద్దరి దగ్గర విఫలమైంది. “ఏం చేద్దాం? మనకి ఈ జన్మకి ఇంతే ప్రాప్తి అనుకుందాం అని రమేష్ అన్నాడు” అంతా నా వల్లనే కదా, మీకు ఈ బాధ అంది. అలా అనుకోకు ఉమ. “నేను నీ ఆరోగ్య విషయం తెలుసుకొనే నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఆ మాటతో కొంచెం ఊరట చెందింది ఉమ.

ఆశాజ్యోతి
ఆశాజ్యోతి

ఒకరోజు ఉమ స్నేహితురాలు రమ వచ్చింది. ఏమిటే విశేషాలు అని అడిగింది. ఏం లేవు మాములే. పిల్లల గురించి బాధ పడుతూ, తనకి జరిగిన విషయం అంతా చెప్పింది. ఓసే పిచ్చిదానా, ఎందుకే కావాల్సిన వాళ్ళను అడిగావు. నాకు తెలిసిన చిన్న పిల్లల అనాధ ఆశ్రమానికి వెళ్లితే, నీకు ఏ బిడ్డ కావాలి అంటే ఆ బిడ్డ బంగారంలా దొరుకుతుంది అంది. నాకు తెలుసులే, కాని మన కులం కాని వాళ్ళు. పైగా ఎవరికి పుట్టిన  బిడ్డనో, ఏమిటో? అని మేము ఆ దైర్యం చెయ్యలేదు. ఇంకా కులం, మన, పర, మతం అనే భేదం ఏమిటే? అప్పుడే పుట్టిన పసిగుడ్డు దేవునితో సమానం అంది. నీ మాట ప్రకారం,రేపు వెళ్లి బిడ్డను చూసి తెచ్చుకుందాం అంది.

ఇద్దరు కలిసి బయలుదేరారు. భర్తని కూడా రమ్మంది. తనకి ఆఫీస్ లో కొంచెం పని చూసుకోని వస్తా అన్నాడు. ఉమ ఆఫీస్ కి లీవ్ పెట్టింది. ఆలాంబన చిన్న పిల్లల అనాధ ఆశ్రమానికి వెళ్లారు. అక్కడ రిసెప్షన్ లో అన్ని వివరాలు వారికి చెప్పి లోపలకి వెళ్లారు. ఒక్కొక్క గదిలో పిల్లల వయసును బట్టి పిల్లలను వుంచారు. రమ,ఉమ మూడు నెలల పిల్లలు వున్న గదిలోకి వెళ్ళారు. ఆ గదిలోమొత్తం ఒక ఇరవై మంది పిల్లలు ఉండి ఉంటారు. కొందరు పిల్లలు ఏడుస్తున్నారు. ఆ చిన్న పిల్లల ఏడుపును అపుటకు ఆయాలు చాలా అవస్థలు పడుతున్నారు. ఎత్తుకొని తిప్పడం, ఊయలలో, పడుకోబెట్టి ఊపుతున్నారు. ఆలా చేయడం వలన ఒకరు ఇద్దరు పిల్లలు ఏడుపు ఆపేశారు. కొందరు ఆయాలు పిల్లలకి సీసాలతో పాలు పడుతున్నారు. కొందరు పిల్లలు ఆదమరచి నిద్రపోతున్నారు.

ఆ “గది చిన్న పిల్లల ముద్దు ముద్దు మొఖాలతో నిండిపోయింది”. ఒక ఆయా ఏమి కావాలమ్మ అని అడిగింది. ఒక పాపని దత్తత తీసుకుందాం అని వచ్చాం అన్నారు. రండి మేడం అంటు పిల్లల వివరాలు చెప్పింది. దాదాపు అందరు పిల్లలు రోడ్ మీద దొరికిన వాళ్ళే. ఇంత చిన్న పిల్లలని రోడ్ మీద వదలడానికి వాళ్ళకి మనసు ఎలా వస్తుందో?

ఇప్పటి కాలంలో పెంపుడు జంతువులను కూడా అపురూపంగా పెంచుకుంటున్నారు. అక్కడ వున్న పిల్లలలో, దాదాపు అందరు ఆడపిల్లలే, “తను ఒక ఆడమనిషి అయివుండి ఆడపిల్ల పుట్టగానే రోడ్ మీద కొందరు వదిలేసిపోతారు”. ఇంకొందరు “ఏ అన్యాయానికో, ఏ అఘాయిత్యానీకో గురి అయి పుట్టిన పసికందులను సమాజానికి భయపడి ఏమి చేయలేక రోడ్డు మీద పడేసి వెళ్తుంటారు”. రమ అంది. ఏం పాపం చేశారని, ఈ పిల్లలకు ఈ శిక్ష ఉమ అంది..

ఉమకి అందరు పిల్లలూ ముద్దుగానే అనిపించారు. ఉమ ఏం ఆలోచిస్తున్నావు అంది. ఆద మరచి నిద్ర పోతున్న ఒక పాప దగ్గర ఉమ ఆగిపోయింది. చూడవే రమ, ఈ పాపని తెల్లగా ముద్దుగా వుంది. “ఈ పాపకి ఎవరు లేరు”. “మేడం బయట రోడ్డు మీద దొరుకుతేనే ఎవరో తెచ్చి ఇచ్చారు”. ఆయా అంది. రమ నాకు వీళ్ల అందరిని చూస్తుంటే బాధగా వుందే, అందరిని తీసుకోని పోయి చూసుకోవాలి అని వుంది. అవునా! అన్నట్టుగా ఉమవైపు నవ్వుతూ చూసింది. మీరు ఎంత అదృష్టవంతులమ్మ, ఇంత మంది చిన్న పిల్లలకు సేవ చేస్తున్నారు. ఆయాలతో ఉమ అంది.

ఆ పాపను తీసుకోని మేన్ ఆఫీస్ కి ఇంచార్జ్ దగ్గరికి వచ్చారు. ఆ పాప తాలుకు హెల్త్ ఫైల్ అన్ని ఉమకి ఇచ్చారు. ఆ పిల్లకి పేరు ఏమి పెట్టలేదు. అక్కడ వున్న నెంబర్ ప్రకారం పిలిచేవారు. ఉమ తన భర్తకి ఫోన్ చేసేలోపు తనే అడ్రస్ తెలుసుకోని వచ్చాడు. పాపను చూసి, అతను కూడ ఇష్టపడ్డాడు. పాపతో అందరు కలిసి ఇల్లు చేరారు. ఉమ, రమేష్ కి ఇప్పుడు చాలా సంతోషంగా వున్నది. ఇద్దరు కలిసి తన స్నేహితురాలు రమకి థాంక్స్ చెప్పారు.

రమ. నీ మేలు ఎప్పటికి మర్చిపోలేను అంది. ఇందులో మేలు ఏముంది? నీకు ఉన్న ఆలోచననేకదా !”అవును దానికి బలాన్ని ఇచ్చావు”  ఉమ అంది. మనం తెలుసుకోవలసింది ఏమిటి అంటే, ఎవరైన పిల్లలను మనవాళ్ళ దగ్గరి నుండి దత్తత తీసుకోని ఉన్న వాళ్లకి అన్ని సమకూర్చే బదులు, ఈ సమాజంలో అనాధలు, ఎందరో వున్నారు, అమ్మ, నాన్న లేని ఆ పసికందులను దత్తత్త తీసుకొని ప్రయోజకులను చేస్తే,” అప్పుడు సమాజం బాగుపడుతుంది” మన కోరిక తీరుతుంది. ఏమంటావు? అంది రమ.

నీలాగ పిల్లలు లేని ప్రతి ఒక్కరు ఆలోచించి, ఈ నిర్ణయం తీసుకుంటే ఈ ప్రపంచంలో అనాధ పిల్లలు ఉండరు కదా! నిజమే రమ నీవు చెప్పింది. నాకు పిల్లలు లేరు అనే చింత తీరింది. ఈ పాపకు ఒక కొత్త జీవితం దొరికింది. అని అంటూ ఉమ మంచం మీద పడుకో బెట్టిన పాపను ఎత్తుకొని ముద్దు పెట్టుకొని తన గుండెలకు అందుకుంది. ఉమ నీకు ఇప్పుడు సంతోషమే కదా! ఇంకా నేను వచ్చినందుకు ఒక మంచి పని చేశాను. అన్న సంతోషం ఉంది. నేను వెళుతాను అంది.

ఆశాజ్యోతి
ఆశాజ్యోతి

ఒకరోజు ఉండి, ఈ పాపకి నీ చేతులు మీదుగా పేరు పెట్టి వెళ్ళు అని బ్రతిమలాడారు. ఆలా అనేసరికి రమ ఏమి అనలేక ఉండిపోయింది. మరునాడు చుట్టు పక్కలో వున్న వాళ్ళని పిలిచి సింపుల్ గా పాపకి కొత్త బట్టలు వేసి, ఊయలలో పడుకోబెట్టి రమ నీవు వచ్చి పాపకి ముందు పేరు పెట్టు అంది. నేనా మీరే ముందు అమ్మ నాన్న మీరే మొదలు అంది. నువ్వే ఈ పాప మా జీవితంలోకి రావడానికి ముఖ్య మైన దానివి, అంటూ రమ చేయి పట్టుకొని ఊయల దగ్గరకు తీసుకు వచ్చింది.

ఊయలలో బోసి నవ్వులతో చూస్తున్న పాప మీదకి వంగి తన చిన్ని చేయిని  తన చేతిలోకి తీసుకోని, “ఇంటిలో అందరికీ ఆనందాన్ని ఇచ్చిన ఈ పాప పేరు ఆశాజ్యోతి అంది”. ఇంత చక్కని పేరు పెట్టి మా కండ్లలో జ్యోతిని వెలిగించిన ఈ పాప నిజంగా మా పాలిట ఆశాజ్యోతే అంటూ భార్య భర్తలు పాప చిన్ని చేతులను తమ చేతుల్లోకి తీసుకుని సంతోషంగా ముద్దు పెట్టుకున్నారు.

– చెరుకు శైలజ

Related Posts