అసూయా ద్వేషాలు

అసూయా ద్వేషాలు

మనిషి మాటున దాగిన
మిన్నకుండాదాగిన లక్షణం

జ్ఞానాన్ని కప్పిన దుప్పటి

విలువలను విస్మరించి

బంధానికి ప్రతిబంధకంగా

పరిచయానికి పంతానికి
తేడాతెలియక

సంతోషాలను దూరంగా

కోపతాపాలకు బందీలు

వినయవిధేయతలకు
దూరం

గౌరవాలు మంటకలిపి

ప్రేమపలుచన చేసి

చైతన్యం చెరిపి వేసి

అన్యాయానికి ఆదిగా

మనశ్శాంతి కి దూరమై

ఆలోచనలు ఆవేశాలుగా

పెత్తనం పెడదోవలో

నీతి నిజాయితీలు మరచి

మెదడును నిస్తేజం చేసి

కల్మషాలు పెరిగి

సహనం కోల్పోయి

చిక్కుముడులు విప్పక

తప్పులు ఒప్పుకోక

దక్కని చిక్కని వాటితో
పరుగు పందెం

సత్యాన్ని వీడి

స్వార్థం సొంతం చేసుకుని

అలజడి ఆనవాయితీగా
మారి

అంతరంగాన్ని వీడి మనిషిని మనిషిగా
ఉండకుండా దహించి వేస్తాయి అసూయా ద్వేషాలు అంతగా మరి…….?

– జి జయ

Related Posts