అసూయ ద్వేషం

అసూయ ద్వేషం

అవినీతి సమాజంలో నిండిపోయే అసూయా ద్వేషం!
పగలు, పంతం! అన్యాయం అకృత్యం!

అక్కరకు రాని బంధాలకోసం
దేవులాడే మనిషి మనుగడ కోసం!
కళ్లకు సంకెళ్లు వేసి కళ్ళున్నా గుడ్డివాళ్ళయ్యెను నేటి సమాజం!

ఈ సమాజంలో మనలో
ఒకరు మంచి చేస్తే చూడలేని తనం!
ఒకరు బాగుపడితే కుళ్ళకునే మనస్తత్వం! ఒకరు గెలిస్తే తట్టుకోలేని ఆవేశం! కోపం!

ఎందుకీ అసూయా ద్వేషాలు?
ఎందుకీ పగలు పంతాలు?
మంచితనానికి మానవత్వానికి,
సహాయానికి రోజులు చెల్లినట్లేనా??
మకిలి పట్టిన సమాజానికి చెక్ పెట్టలేమా??
మహోన్నతమైన భారత జాతిని కాపాడలేమా?

– గాయత్రీభాస్కర్ 

Related Posts