అతివ

అతివ

అతివ అందాల లోకం..
నా సతివ మాలతివ ఆలపించిన అనురాగం…
కాలమే చెబుతుంది మన కాలమే ముందుంది
మన ఇద్దరమే ఈ లోకంలో ప్రేమికులం…

నిన్ను చూడాలని పరితపిస్తున్నా

నీ ప్రేమకు నేను దాసుడను…

దేవదాసు కాకముందే నా ప్రేమకు అంగీకారమే తెలుపు…

మౌనంగా ఉండబోకు నిను చూడనిదే నాకు మాట రాదు…
నీ మాట కోసమే ఎదురు చూస్తున్నా..

అతివలకు అలకలు సహజమే…

రాజీకి అది మార్గమే..

నామీద నీకు ప్రేమేలే కానీ

అది లోలోన ఉన్నదిలే..

చెప్పకనే చెబుతుంది

నీ కళ్ళ భాష నామీద ప్రేమని…

– పలుకూరి

 

Related Posts