aksharalipi

4929 Posts
“వెళ్లిపోయావా నేస్తం!” — మహాప్రస్థానం వెనుక ఉన్న విషాద గాథ “కొంపెల్ల జనార్దనరావు” గురించి..

“వెళ్లిపోయావా నేస్తం!” — మహాప్రస్థానం వెనుక ఉన్న విషాద గాథ “కొంపెల్ల జనార్దనరావు” గురించి..

"వెళ్లిపోయావా నేస్తం!" — మహాప్రస్థానం వెనుక ఉన్న విషాద గాథ "కొంపెల్ల జనార్దనరావు" గురించి.. తెలుగు సాహిత్య చరిత్రలో కొన్ని పేర్లు తమ రచనల వల్ల చిరస్థాయిగా నిలుస్తాయి. మరికొన్ని పేర్లు, తాము రాసిన దానికంటే ఇతరులలోని ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించి, ఒక కొత్త యుగానికి పునాది వేసినందుకు చిరస్మరణీయమవుతాయి. అలాంటి అరుదైన వ్యక్తుల్లో "కొంపెల్ల జనార్దనరావు" ఒకరు. 1906 ఏప్రిల్ 15న ఒక జమీందారీ కుటుంబంలో జన్మించిన కొంపెల్ల, చిన్న వయసులోనే జీవితపు కఠిన వాస్తవాలను ఎదుర్కొన్నారు. కుటుంబ ఆస్తులు కరిగిపోవడంతో చదువు మధ్యలోనే ఆగిపోయింది. కానీ సాహిత్యంపై ప్రేమ మాత్రం ఆగలేదు. మద్రాసు చేరి భారతి పత్రికలో ఉపసంపాదకుడిగా పనిచేస్తూ తెలుగు సాహిత్యంలో కొత్త ఆలోచనలకు వేదిక కల్పించారు. భావకవిత్వం రాశారు. నాటికలు రచించారు. కానీ ఆయన గొప్పతనం అక్కడితో ఆగిపోలేదు. ఆయనకు కొత్త కవులంటే అపారమైన ప్రేమ. కొత్త ఆలోచనలంటే అమితమైన గౌరవం. అందుకే ఉదయిని అనే…
Read More
ఆ!!వె!!🪷💐

ఆ!!వె!!🪷💐

ఆ!!వె!!🪷💐 రాత్రిపూట దోమ రక్తమ్ము బీల్చునుపగటివేళ నీగ పట్టిపీల్చు!పగలురేయిననక పట్టి పీల్చునదేదితెలుసుకోర కృష్ణ తెలివితోడ!! !!కం!!🚩🪷 మితవాదిగాను మెలగుచుగతమును మరిపించి గురువు ఘనతను గూర్చున్హితమును బోధించుచు తాసతతమ్మాశీర్వదించు చాత్రుల కృష్ణా!! గడ్డం కృష్ణారెడ్డి
Read More
మాటలు వచ్చినా మూగవాళ్ళ

మాటలు వచ్చినా మూగవాళ్ళ

మాటలు వచ్చినా మూగవాళ్ళ మాట్లాడితే మురిసేపోయే మనస్సు నాది కాని మాట్లాడటమే ఇష్టం లేదు నాతోప్రత్యక్షంగా ముందు ఉండి ముచ్చట్లు పెడితే సంబరపడే మనస్సు నాది కాని పరోక్షంగా చూసి చూడనట్టు ఉన్నారుమనిషి ఎవరైతే ఏమి ప్రేమా గా మాట్లాడే మంచి మనస్సు నాదిమాట్లాడడానికి మనిషే తోడు లేకపోయినా ఎందరో తమలో తామే మాట్లాడుకుంటే లోకం దృష్టిలో పిచ్చి వాళ్ళుఎక్కువ గా ఆన్ లైన్ మాట్లాడటం కంటే ఆప్ లైన్ మాట్లాడితేనే మనసు ఎక్కువ సంబరపడుతుందిమనిషి ఉన్నప్పుడు మాట్లాడని మనుషులు ఆ మనిషి పోయాక ఒకసారి మాట్లాడు అంటు కపట ప్రేమ చూపిస్తున్నారు చాలామందిమాట్లాడడానికి మనిషినే తోడు లేక ఎంతోమంది మనుషులు మానసికంగా కృంగి కృశించి పోతున్నారుమాటలు రాని వాడే మూగవాడు కాదుమాటలు వచ్చినా మాట్లాడానికి మనిషి లేక మూగపోయినా గోంతులు ఎన్నోమానవ సంబంధాలు బలహీనత పడటానికి ముఖ్య కారణం కుటుంబం సభ్యులు కలిసిమెలిసి మాట్లాడుకోలేకపోవడంఎవరి లోకంలో వారు బిజీ బిజీగా…
Read More
మోసపోకు యువత…

మోసపోకు యువత…

మోసపోకు యువత… మూగబోయిన యువతమాట్లాడటం మానేసిందిరోజంతా సోషల్ మీడియాలో గడపడంచదువుని చిన్నచూపు చూడటంఉల్లాసం అనే సాకుతోమద్యం సేవించడంబద్ధకం ఎక్కువై బెట్టింగ్ లలోడబ్బులు తగలేయడండ్రగ్స్ కి అలవాటవ్వడంసినిమా హీరోలకిబానిసత్వం చేయడంమంచి మాటలనిగాలికి వదిలేయడంతల్లిదండ్రులని ఎదురించడంసమాజాన్ని పట్టించుకోకపోవడంమూగబోయిన యువతరమామోసపోకు యువత… P. అనిల్
Read More
సుస్వరానికి స్వరాభిషేకం…!!!

సుస్వరానికి స్వరాభిషేకం…!!!

సుస్వరానికి స్వరాభిషేకం…!!! ఆ స్వరంలోని మాధుర్యంఎన్నో హృదయాలకు జోలపాటైనదిఆ కంఠంలోని కమ్మదనం…ఎన్నో గొంతులలో కవణమై దిగినదిచినుకుల సవ్వడికి మువ్వల రాగంప్రకృతి చిగురులకు అడుగుల తాళం…కొండా కోనలలో కోయిలకు పాటైనజానకమ్మ సుస్వరానికి స్వరాభిషేకం… ఒలికిన నీ చిరుమందహాసంమదిలో దాచుకొనే పాటల పుస్తకం..‌.ఎన్నో భావాలకు అర్థాన్ని పాడిన ఆనందంమా చెవులలో నిత్యం వినిపిస్తూనే ఉందిదివికేగిన ఆ సంగీతం మరువని స్నేహమై…మనస్సులను నిత్యం తడుతూనే ఉంటుందికలకాదు నిజమే జీవితం ఒక అనుభవమే…జానకమ్మ గారి పాటలన్నీ గానామృతమే… నిన్న నేడు రేపటితో మరుపు కాదుభూమి ఉన్నంత వరకు జ్ఞాపకానివి…మనస్సు చేసిన అంతరాలలో మజిలీవిమొలకేసిన మానవత్వానికి రూపానివి…జాతికి గర్వకారణమైన అమృతగాయనికిమా అందరి తరుపున ఆశ్రునివాళులు… నిండైన హృదయంతో గృహిణీవిపిల్లా పాపలను లాలించిన తల్లివి…తోడు నీడలతో పరిస్థితులను గెలుస్తూనేప్రతి ఆప్యాయతలను మూటగట్టుకొని…పాటమ్మతోటే ప్రయాణాన్ని నడిపించినాతప్పని విధి సంకల్పానికి తలవంచావు…జన హృదయాలలో చెరగని ముద్రవైనావు దేరంగుల భైరవ
Read More
ఎం.టి.వాసుదేవన్ నాయర్

ఎం.టి.వాసుదేవన్ నాయర్

ఎం.టి.వాసుదేవన్ నాయర్ ఎం.టి.వాసుదేవన్ నాయర్ (కేరళ రచయిత, పద్మభూషణ్, జ్ఞానపీఠ పురస్కారాల గ్రహీత) ఎం.టి.వాసుదేవన్ నాయర్ మలయాళ రచయిత. ఆయన ప్రతిష్ఠాత్మక జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందడం ద్వారా భారతీయ సాహిత్యరంగంలో ప్రాచుర్యం పొందారు.వాసుదేవన్ నాయర్ నేటి కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన కొడల్లూర్ గ్రామంలో 1933 జూలై 15న జన్మించారు. ఆయన జన్మించిన నాటికి ఆ ప్రాంతం బ్రిటీష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీ మలబారు ప్రాంతంలోనిది. ఆయన చిన్నతనం పున్నయర్కుళం గ్రామంలో గడిపారు. కుమరనెల్లూరు గ్రామంలో పాఠశాల విద్యను, పాలక్కాడ్ (పాల్ఘాట్) పట్టణంలోని విక్టోరియా కళాశాలలో కళాశాల విద్యనూ పూర్తిచేసుకున్నారు. 1950దశకం తొలినాళ్ళ నుంచీ చిన్నకథలను వ్రాయడం ప్రారంభించిన వాసుదేవన్ నాయర్ 1958లోని నాలుకెట్టు (కేరళ సంప్రదాయ గృహం), 1962లో అసురవిత్తు (రాక్షస బీజం), 1964లో మంజు (మంచు), 1969లో కాలం, 1984లో రాండమూఝం (రెండవ సారి), విలపయత్ర, పతిరవుం పకల్వెలిచెవుం (అర్థరాత్రీ, పగటివెల్తురు), వారణాసి తదితర నవలలను రచించారు.…
Read More
డి.వి.నరసరాజు

డి.వి.నరసరాజు

డి.వి.నరసరాజు డి.వి. నరసరాజు గా ప్రసిద్ధుడైన దాట్ల వెంకట నరసరాజు (జూలై 15, 1920 - ఆగష్టు 28, 2006) రంగస్థల, సినిమా నటుడు, రచయిత, దర్శకుడు.1920 జూలై 15న గుంటూరు జిల్లా, సత్తెనపల్లి మండలంలోని తాళ్లూరులో జన్మించాడు. ఇతను హేతువాది. నరసరావుపేట వాస్తవ్యుడు అయిన ఎం.ఎన్.రాయ్ అనుచరుడు. సినీ కథా రచయిత.ఈనాడు పత్రికలో కొంతకాలం పనిచేశాడు. డి.వి.నరసరాజు సినీ కథ, సంభాషణల రచయితగా సుప్రసిద్ధులు. ఆయన రచించిన సినిమాలలో హాస్యరసం తొణికిసలాడుతూ ప్రేక్షకుల్ని నవ్వించింది. ఆయన మౌలికంగా నాటక రంగం నుంచి సినిమాలలోకి వచ్చారు. నరసరాజు గుంటూరులోని హిందూ ఉన్నతపాఠశాలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని, హిందూ కళాశాలలో ఇంటర్ తర్వాత మద్రాసు లయోలా కళాశాల నుండి బి.ఏ పూర్తి చేశాడు. సినిమాలలోకి రాకముందు నాటక రచయితగా పేరుతెచ్చుకున్నాడు. ఈ ఇల్లు అమ్మబడును, వాపసు నాటకం రాశాడు.నరసరాజు 1954లో పెద్దమనుషులు సినిమాతో రచయితగా సినీరంగప్రవేశం చేశాడు. ఆ సినిమా విజయవంతమవడంతో సినీ…
Read More
ఎలా బ్రతకాలో!

ఎలా బ్రతకాలో!

ఎలా బ్రతకాలో! ఈ సమాజంలో ఎలాబ్రతకాలో! ఎలా బ్రతికినాకష్టమే! సమాజం పెట్టినఆంక్షలు సంకెళ్లే! ఆ సంకెళ్ల బ్రతుకు బ్రతికినాఅన్నీ బాధలే! అలా కూడాబ్రకనీయరు ఈ జనం మంచిగాఉన్నా తప్పే! చెడు పని చేసినా తప్పే! ఈ సమాజపు కట్టుబాట్లనుఎలా తట్టుకోవాలో తెలియడంలేదు ఈ కల్మషమైన సమాజంలోబ్రతకడమెలాగో? అర్థం కాదు! అర్థం చేసుకునే మనుషులుకరువయ్యారు! మాట్లాడే పెదవులకన్నా సాయం చేసే చేతులు మిన్నకానీ వెటకారాలే ఎక్కువ! మనుషులమైన మనంమానవత్వం మరుస్తున్నాంమనిషితత్వం కోల్పోతున్నాంమనుషులమని గుర్తుంచుకోండి!సమానత్వం పాటించండి! ఉమాదేవి ఎర్రం
Read More
ప్రహేళిక ఆ!!వె!!🪷

ప్రహేళిక ఆ!!వె!!🪷

ప్రహేళిక ఆ!!వె!!🪷 చల్లకుండలోన మెల్లకన్నును చూసికన్నె పిల్ల నవ్వె వెన్న ముద్దకరుగు వేడిజేయ కంఠస్వరమనినకోకిలమ్మ దగను గదర కృష్ణ!! కోతిమూతినాకు కుక్క తోకను చూడవంకరుండు మేక పాలు మేలుగూర్చు కాకిగూడు కొమ్మన వ్రేలాడుగబ్బిలములు గవిని గదర కృష్ణ!! గడ్డం కృష్ణారెడ్డి
Read More
సమాజపు సంకెళ్లు

సమాజపు సంకెళ్లు

సమాజపు సంకెళ్లు ఎవరికి ఎవరికి ఈ సమాజపు సంకెళ్లునిబద్ధత నడిచే నీతి గుండెలకేనానిజాయితీతో జీవించు చేతులకేనాన్యాయ నిలువుకు నిలచే మనసులకేనా కలికాలం నుండి కలకాలం వరకుసమాజ సంకెళ్లు సాగుతివి తప్పవామధ్యతరగతి గుండె మంటలు తప్పవానిరంతర పోరాట నీడలు తప్పవా ఇంకా ఎంత కాలం ఈ బరువు మోయగలంఇంకా ఎంత కాలం ఈ మౌనం మోయగలంపొద్దున పనులు సాయంత్ర కలలుమధ్యలో కూలిన మృదువైన హృదయాలు అద్దె గోడల చాటు అవమానం దాచిరాత్రి పూట నవ్వుతూ నిలబడి రక్తం కక్కిచేతుల్లో చెమట కన్నుల్లో తడిఎవరూ గుర్తించని ఈ చిన్న యుద్ధములు న్యాయం వెలుగుతుంటే ఆగదు మా అడుగుభయము చెదిరినపుడు తెరువులు విప్పుతాయిఒక్క అడుగు చాలు లెక్కలు మార్చగలదుఒక్క అడుగు చాలు భయాలు చెదరగలదు ఈ నేల మీదే మా రక్తం కారిందిఈ గాలి మీదే మా శ్వాస నడిచిందిమా పిల్లల భవిత మౌనంలో కాదుమా గళం లేచిన వెంటనే గోడలు కూలుతాయి సమాజపు సంకెళ్లు…
Read More