aksharalipi

5119 Posts
అపజయాన్ని చూసి

అపజయాన్ని చూసి

అక్షర కొరకుఅంశం :⁠- జీవిత సత్యాలు(చిత్ర కవిత)తేది:⁠- 09/08/2026శీర్షిక:⁠- అపజయాన్ని చూసి జీవితం ఒక నిరంతర ప్రయాణం.ఇందులో లెక్కలేనన్ని అనుభవాలు,సంతోషాలు, కష్టాలు మరియు వైరుధ్యాలు ఉంటాయి.ప్రతి మనిషి తన జీవిత ప్రయాణంలో వేర్వేరు సత్యాలను అనుభవిస్తాడు. జీవితంలోని తీవ్రమైన సామాజిక మరియు ఆర్థిక అసమానతలను ఆవిష్కరిస్తుంది. ఒక పెద్ద, ఎత్తైన గోడ సమాజాన్ని రెండు వేర్వేరు ప్రపంచాలుగా విభజిస్తుంది. ఎడమ వైపున, ఒక సంపన్న కుటుంబం ఆధునిక ఇల్లు, ఈత కొలను, విలాసవంతమైన కారు మరియు సంతోషంగా బార్బెక్యూతో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. ఇది విజయం, భద్రత మరియు సుఖాన్ని సూచిస్తుంది.దీనికి పూర్తిగా భిన్నంగా, కుడి వైపున పేదరికం, కష్టం మరియు ఆర్థిక ఒత్తిడి స్పష్టంగా ఉన్నాయి. పాత భవనాలు, కిక్కిరిసిన గుంపులు, మరియు అద్దె బకాయి అనే పోస్టర్లు తీవ్రమైన ఆర్థిక కష్టాలను తెలియజేస్తున్నాయి.గుంపులో ఒక చిన్న కుటుంబం టేబుల్ వద్ద కూర్చుని, ఆందోళనగా బిల్లులు, పన్నులు మరియు ఖర్చులను…
Read More
ఎక్కువ వ్యాయామాలు

ఎక్కువ వ్యాయామాలు

అక్షర కొరకుఅంశం :⁠- సైజ్ జీరో(చిత్ర కవిత)తేది:⁠- 09/08/2026శీర్షిక:⁠- ఎక్కువ వ్యాయామాలు "ఏంటి! ఈ అమ్మాయి ఇలా ఉంది?బాగా తింటుందేమో!అందుకే ఇంత లావుగా ఉంది.అయినా లావు ఉన్నవాళ్లే ఎక్కువ తింటారులే" అని రోడ్డు మీద వెళ్తున్న నన్ను అన్నారు. పెళ్లికి ముందు లావు అయితే… ఏంటి ఈ అమ్మాయి ఇలా ఉంది అని అంటారు? పెళ్లి తర్వాత లావైతే… అబ్బో దీని మొగుడు ఎంత బాగా చూసుకుంటున్నాడు అంటారు?అలాంటి మాటలు అన్నా ఏ అమ్మాయి అయినా సరే కచ్చితంగా నేను లావు తగ్గాలి అనే గట్టి నిర్ణయంతో ఏవి చెప్తే అవి చేయడానికి సిద్ధపడి పోతారు నాలాగా?అప్పుడు అర్థం కాలేదు వాళ్ళ మాటలు పట్టించుకుంటే… మనం మన ఆరోగ్యాన్ని మనశ్శాంతిని కోల్పోతామని.పిల్లలు పుట్టిన తర్వాత లావు అవ్వడం సహజం.లావు ఉన్నవాళ్లే ఎక్కువ తింటారు సన్నగా ఉన్న వాళ్ళే తక్కువ తింటారు అని అనుకోవడం పొరపాటు.లావుగా ఉన్నాము అన్నా భయంతో… ఏది తినాలన్నా…
Read More
మంచి పనులు

మంచి పనులు

అక్షర కొరకుఅంశం - అందమైన జీవితానికి అర్థంరచన - ఉమాదేవి ఎర్రం శీర్షిక - మంచి పనులు కావాలి అందమైన జీవితంఅందుకు చేయాలి మంచి పనులుదగా, మెాసం, ఒకరిని ముంచడంచేయకూడదు! ఈర్ష్య, అసూయ లుపెంచు కోకూడదు! మనకు చాతనైతే ఇతరులకుసహాయం చేయాలి లేకపోతేమానేయాలి! అంతే కానీ మెాసంచేయాలనే ఆలోచన కూడా పాపమే! అందమైన జీవితం ఊరికెనే రాదుదేవుడు మెచ్చాలి! నలుగురికినచ్చాలి! మంచి పనులు చేయాలిభగవంతుని ధ్యానం చేయాలి! అప్పుడే జీవితానికి ముక్తినీ పాపాలకు విముక్తి కలిగిఉండు శక్తి బ్రతక గలగాలి యుక్తిచేయాలను కోకు రక్తి ఇస్తాడునీకు ముక్తి! మంచి వాల్ల తో స్నేహం చేయిమంచి వస్తుంది నీకు…చెడ్డ వారితో స్నేహం చేస్తే చెడువస్తుంది చూడు.. పాపం పనులుఅసలే చేయకు అందమైన జీవితం నీదే! ఇది నా స్వీయ రచన..
Read More
ఆ!!వె!!💐💐 ప్రహేళిక

ఆ!!వె!!💐💐 ప్రహేళిక

బావిలోని కప్ప బాతు గుడ్లను పెట్టునీటిలోన ముళ్ళు నిజము చెప్పుపండితుడు రూపవతియు రాణి పరమసుఖము నిచ్చు పడితి చూడ కృష్ణ!! ఆ!!వె!!💐🪷 లోభివాని వెనుక లోకమ్ము దిరుగునుపాపివెంట చూడ పదుగురుండు!ఒంటె పెదవి కోరి తుంటరి నక్కలుయెదురుచూసినట్లు గదర కృష్ణ!! గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట!!
Read More
వి.జయశంకర్(తెలుగు సినిమా డైలాగ్ రచయిత, కథా రచయిత)

వి.జయశంకర్(తెలుగు సినిమా డైలాగ్ రచయిత, కథా రచయిత)

వి.జయశంకర్ (జ: 1989 ఆగష్టు 9) తెలుగు సినిమా రచయిత, దర్శకుడు. పేపర్ బాయ్ సినిమాతో దర్శకుడిగా తెలుగు సినిమారంగంలోకి అడుగుపెట్టాడు.వి. జయశంకర్ తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదులో జన్మించాడు. చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చేసారు. ఆయన అనుకోకుండా ప్రముఖ కథారచయిత ఆదివిష్ణు విఘ్నేశ్వరరావును కలిసారు. ఆదివిష్ణు గారు ఆయనను కథలు వ్రాయుటకు ప్రోత్సహించారు. తరువాత ఆదివిష్ణు గారి సహకారంలో ఆయన అనేక కథలు వ్రాసారు. జయశంకర్ కు తెలుగు భాషపై పట్టు ఉంది. ఆయన ప్రముఖ రచయిత మల్లాది వెంకట కృష్ణమూర్తితో కలసి పనిచేస్తుంటారు. ఆయన రాసిన అనేక కథలు విజయం సాధించాయి. టెలివిజన్ సీరియళ్ళ కథా రచయితఅపరంజిముద్దుబిడ్డఅభిషేకంమావిచిగురుచిన్న కోడలువంటి సీరియళ్ళకు కథను అందించాడు. లఘుచిత్ర దర్శకుడు, రచయితలవ్ యు ఫర్ ఎవర్ (2014)హాఫ్ గర్ల్ ప్రెండ్ (2014)ద గాడ్ మస్ట్ బె క్రేజీ (2015)హాపీ ఎండిగ్ (2015)రామాయణం లో తుప్పాకుల వేట(2016) సంభాషణలుపదునైన…
Read More
వెలుదండ నిత్యానందరావు(రచయిత, పరిశోధకుడు, ఆచార్యుడు)

వెలుదండ నిత్యానందరావు(రచయిత, పరిశోధకుడు, ఆచార్యుడు)

వెలుదండ నిత్యానందరావు పేరుపొందిన రచయిత, పరిశోధకుడు, ఉపన్యాసకుడు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రస్తుత ఉపకులపతి.ఇతడు 1962, ఆగష్టు 9వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లా, మంగునూరులో వెలుదండ రామేశ్వరరావు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి కవి, పండితుడు. ఇతని సోదరులు వెలుదండ సత్యనారాయణరావు, వెలుదండ వేంకటేశ్వరరావులు కూడా డాక్టరెట్లు చేసినవారు, కవులు, రచయితలు. నిత్యానందరావు ప్రాథమిక విద్యాభ్యాసాన్ని మంగనూరులో పూర్తి చేసుకొన్నాడు. ఆ తర్వాత శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ ప్రాచ్య కళాశాల, పాలెంలో 1983లో డిగ్రీ చేసాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. (1985), ఎం.ఫిల్‌. (1988), పిహెచ్‌.డి. (1990) పూర్తి చేసుకొని తను చదివిన విశ్వవిద్యాలయ తెలుగుశాఖలో 24-జులై 1992న లెక్చరరుగా చేరాడు. క్రమంగా సహాయాచార్యుడుగా, ఆచార్యుడుగా, తెలుగు విభాగం అధిపతి(2015-2017)గా, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మెన్ గా ఎదిగాడు. వివిధ విశ్వవిద్యాలయాల తెలుగుశాఖలలో పాఠ్య నిర్ణాయకసంఘం అధ్యక్షుడుగా సేవలందించారు. అధ్యాపకుల ఎంపికలలో విషయ నిపుణులుగా వ్యవహరించారు. ఇతడు కవిగా, కథకుడుగా, నాటకకర్తగా,…
Read More
జాలాది రాజారావు(తెలుగు రచయిత)

జాలాది రాజారావు(తెలుగు రచయిత)

జాలాది గా ప్రసిద్ధుడైన జాలాది రాజారావు ప్రముఖ తెలుగు రచయిత. ఈయన 275 సినిమాలకు 1500 పైగా పాటలు రచించాడు.జాలాది రాజారావు 1932, ఆగస్టు 9 న కృష్ణాజిల్లా, గుడివాడ మండలం దొండపాడులో జన్మించాడు. ఆయన అమృతమ్మ,జాలాది ఇమ్మాన్యుయేల్ దంపతులకు నాల్గవ కుమారునిగా జన్మించాడు. అతని తండ్రి కృష్ణా జిల్లా బోర్డు సభ్యుడు, భారత స్వాతంత్ర్య సమరయోధుడు. ఆయన తన ఎస్.ఎస్.ఎల్.సి.ని తెలుగు ప్రత్యేక కోర్సుగా తీసుకొని ఉత్తీర్ణులయ్యాడు. జిల్లా బోర్డు పాఠశాలల్లో డ్రాయింగ్ టీచర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించాడు. వివిధ జిల్లాల్లో పనిచేసిన ఆయన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఉపయోగించే యాసను నేర్చుకున్నాడు. 1968లో శ్రీకాకుళం జిల్లాలోని వీరఘట్టంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి, సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చెన్నై వెళ్లాడు.ఆయన 1976లో పల్లె సీమ చిత్రానికి గీత రచయితగా సినిమా రంగంలోకి ప్రవేశించాడు. ఆయన తొలి పాట "చూరట్టుకు జారతాది చిటుక్కు చిటుక్కు వాన చుక్క" కె.వి.…
Read More
అందమైన జీవితానికి అర్థం

అందమైన జీవితానికి అర్థం

అక్షర కొరకుఅంశం : అందమైన జీవితానికి అర్థంశీర్షిక : ఔషధం శ్రీదేవి చాలా కష్టపడి సినిమాల్లో అవకాశం సంపాదించింది. ఒక్క సినిమా హిట్ కావడంతో ఆమెకు చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.కొన్నేళ్లు ఆమె సినిమా రంగాన్ని ఎలింది అని చెప్పవచ్చు. తర్వాత కొత్తనీరు వచ్చినట్టు కొత్తగా హీరోయిన్ లు రావడం వలన జనరేషన్ మారడం వలన ఆమెకు సినిమాలు తగ్గిపోయాయి. తనకు సినిమాలు తగ్గినా కూడా తాను అందంగా ఉండాలని కోరుకుంటూ దానికి తగినట్టుగా మెడిసిన్స్ వాడుతుంది అప్పటికే ముక్కు ఆపరేషన్, పెదవులకు కూడా ఆపరేషన్ కూడా చేయించుకుంది. తర్వాత అందమైన మొహం కోసం మొహానికి రకరకాల ఇంజెక్షన్స్ చేయించుకుంది. ఆమె అందానికి ప్రాముఖ్యత ఇచ్చినట్టు మిగతా విషయాలలో ప్రాముఖ్యత ఇవ్వదు. అలా అన్నీ రకాల ఇంజక్షన్స్ తీసుకోవడం నిమిషానికి ఒక టాబ్లెట్ వేసుకోవడం వల్ల ఆమె శరీరం బాగా పాడైపోయింది. అసలు ఆమెకు కనీసం చేయి కూడా కదపలేని స్థితికి…
Read More
ఫల్టీల జీవితం

ఫల్టీల జీవితం

ఫల్టీల జీవితం,,,,,,,! ఉరి బిగుస్తున్నా కొద్ది ఊపిరి పలుచనైనట్లుకంత్రీ వెధవల చేతుల్లో కరిగిపోయే ఐస్ ముక్కలా జీవితంసుదీర్ఘ పోరాటాలు చేసి జవసత్వాలుడిగి చావు పొలిమేరల్లోరక్త కన్నీరు కార్చే ఎర్ర గులాబీలువెన్నుదన్నుగా ఉండి వెన్నుపోటు పొడిచిన మిత్రులుఆ పాశాన హృదయులు రక్తపు కోరలు చాస్తూ,,,,,,,,వెర్రిపట్టిన వాడిలా నిప్పులపై నడక అగ్ని దేవున్ని ప్రార్థిస్తూ నేను,,,,,,,కనుపాపలు చూసినంత మేరా నీచాతి నీచులేవేలాడే ఉరి కొయ్యలు నాకా నీకా!?పట్టపగలు నడిరోడ్డుపై భార్యాభర్తల హత్యపట్టించుకునే వాడు లేక విలపిస్తున్న ప్రజాస్వామ్యం!కసితీరా నవ్వుల వికృత అపహాస్యాల మద్య మందు మాంసంతో కిరాతకుల వెర్రి !మల్లె పూలన్నీ నల్లనై దేవుడనే పిశాచం మెడలో దండలై,,,,,,దుఃఖిత ఎదలు రాల్చే కన్నీటితో సాగుభూముల సేద్యంకటిక చీకటి కాళరాత్రి జన్మనిచ్చిన తల్లి శిశువుల మరణంపిల్లలందరూ ఎండిన డొక్కలు పీక్కుపోయిన కళ్ళతో సర్కారు బడికిముదనష్టపు పాలకుల ఇచ్చే గంటకో జీవో ఉద్యోగాలు లేవు బోర్డు మెడకేసుకుని మరీదేశం చాలా బాగా అభివృద్ధి చెందిందివృద్దాప్య పింఛన్లు రైతులకు…
Read More
యాంత్రిక జీవనం

యాంత్రిక జీవనం

అంశం - యాంత్రిక జీవనంరచన - అనిల్ పోచంపెల్లి పరుగెత్తు పరుగెత్తుఉదయం లేచినప్పటినుంచిబ్రతుకడం కోసం పరుగెత్తుపొట్ట నింపడంకోసం పరుగెత్తు పరుగెత్తే జీవితంలోసమయానికి సందే లేదుమనుషుల మధ్యపరిచయాలు పాతిపెట్టబడ్డాయి ఆరోగ్యమనే పట్టింపే లేదువ్యాయామం చేయాలనేఉద్దేశము లేదురీల్స్ స్క్రోలింగ్ కిసమయముంది కానీకుటుంబంతో మాట్లాడటానికిమాత్రం మాటలు రావు పని తగ్గించడానికి యంత్రాలుఉండేటివి ఇప్పుడుమనిషే ఓయంత్రంగా మారాడుఎంత పరుగెత్తినాచివరికి పాతాళంలోకే కదా! ఇది నా స్వీయ రచన
Read More