aksharalipi

3050 Posts

ఎన్నెల రోజులు

ఎన్నెల రోజులు మా సిన్నప్పుడు ఊర్లో ఇటుకలతో కట్టిన ఇల్లు ఉండేది. మా అయ్యతో కలిపి ముగ్గురన్నదమ్ములు ఇద్దరు చెల్లెళ్ళు అంటే మాకు అత్తలు, అవ్వ, నాయనవ్వ అంతా కలిసే ఉండేవాళ్ళం. ఇల్లంతా పొద్దున మహా సందడిగా ఉండేది. మా అవ్వ మబ్బున్నే లేసి పొయ్యి ఏలిగించి, పెద్ద బాగొను లో నీళ్ళు యెట్టి, నోట్లో బోగ్గేసుకుని, చెబట్టికు పోయేది. రాగానే నీళ్ళు తోలుపుకుని నాలుగు గుంజెలకు కట్టిన దడిలోకి ఏళ్ళి మొఖం కడుక్కుని,పేయ్యి కడుక్కొని అచ్చి, ఇంకో పొయ్యి మిన పెద్ద బోగొను లో అన్నం వండేది. ఇగ పిల్లలం,పెద్దోళ్ళులేసి బోగ్గులతో పళ్ళు తోముకుని అచ్చెటోల్లు. అప్పటికి మా అవ్వ అన్నం అయ్యేది. పెద్దోళ్ళు అంతా అంటే మా నాయిన, చిన్నాయినలు మొగాలు కడుక్కుని అచ్చి కూసుంటే మా అవ్వ అందరికీ సిల్వెండి కంచాల్లో బువ్వేసి చింతకాయ తొక్కు ఏసేది. అందరూ ఉదుకుంటు బువ్వ తిని అవ్వ కట్టిన సద్ది…
Read More

వెన్నెల రోజులు

వెన్నెల రోజులు విరహాన్ని దాచుకుని ప్రియుడి కై వేచి చూసే పడతి కి తెలుసు వెన్నెల అందం విరహం తో వేగి పోతూ ప్రియురాలి కోసం వెళ్ళే ప్రియుడు పాడుకునే వెన్నెల గీతం వయసులో ఉన్న దంపతులు కోరే వెన్నెల పాన్పు అందమైన ఆడపిల్లలు ఊహల మాలలు కట్టేది వెన్నెల లో అందమైన చేతులకు గోరింటాకు పెట్టుకుని అది పండిన తర్వాత దాని అందాన్ని చూసేది వెన్నెల వెలుగు లోనే ఆరుబయట నులక మంచం లో పడుకుని అందమైన ఆకాశం వంక చూస్తూ ఆ వెన్నెల్లో కాబోయే శ్రీమతి గురించి కవితలల్లుతూ ఊహల్లో తేలిపోతూ ఉండే పడుచు కుర్రాళ్లను ఆపతరమా అమ్మ చేతి గోరు ముద్దలు తినకుండా పరుగెత్తే పాపాయి నీ అపగలమా వెన్నెల్లో విహరించే ఆడపిల్ల ఊహలను అపగలనా వాటన్నిటికీ నేను కూడా ఒక సాక్ష్యమే కదా..... ప్రణవ్
Read More

పంచాంగము 23.01.2022

పంచాంగము 23.01.2022 *_శ్రీ ప్లవ నామ సంవత్సరం_* *ఉత్తరాయణం - హేమంతఋతువు* *పుష్య మాసం - బహళ పక్షం* తిధి : *పంచమి* ఉ7.10వరకు తదుపరి *షష్ఠి* తె6.07వరకు వారం : *ఆదివారం* (భానువాసరే) నక్షత్రం: *ఉత్తర* ఉ9.35వరకు తదుపరి హస్త యోగం: *అతిగండ* ఉ11.40 వరకు కరణం: *తైతుల* ఉ7.10 & *గరజి* సా6.39 తదుపరి *వణిజ* తె6.07వరకు వర్జ్యం: *సా5.51 - 7.26* దుర్ముహూర్తం : *సా4.16 - 5.01* అమృతకాలం: *తె3.19 - 4.54* రాహుకాలం : *సా4.30 - 6.00* యమగండ/కేతుకాలం: *మ12.00 - 1.30* సూర్యరాశి: *మకరం* || చంద్రరాశి: *కన్య* సూర్యోదయం: *6.38* || సూర్యాస్తమయం: *5.46* సర్వేజనా సుఖినో భవంతు - శుభమస్తు 🙏  
Read More

పెళ్ళవుతుందా

పెళ్ళవుతుందా కీర్తన ఒక మామూలు అమ్మాయి. తానేంటో తన పనే ఏంటో చేసుకుని వెళ్తుంది. ఎవరితో ఎక్కువ చనువుగా ఉండదు. తనలోని భావాలను అప్పుడప్పుడు పత్రికలకు పంపుతూ ఉండేది. అలాంటి సమయం లో మీ భావాలు చాలా బాగున్నాయి అంటూ ఒక అభిమాని తనకు ఉత్తరాలు రాసేవాడు. అవి చూసిన కీర్తన చాలా సంతోష పడేది. కాలం గడుస్తున్నది. అతను ఉత్తరాలు రాసేవాడు. తిరిగి కీర్తన కూడా జవాబులు రాస్తూ ఉండేది. అలా పరిచయం పెరుగుతూ వచ్చింది. మరో వైపు కీర్తన ఇంట్లో సంబంధాలు చూడడం మొదలు పెట్టారు. కానీ కాలం కలిసి రాక ఏ ఒక్క సంబంధం కుదరడం లేదు. సంబంధాలు కుదరక పోవడం వల్ల కీర్తన చాలా ఆత్మన్యూనతకు గురైంది. తనకు పెళ్లి కావడం లేదనే బెంగ పట్టుకుంది. ఎలాగైనా పెళ్లి కావాలనే తన ఆలోచన తనను నిలవనీయలేదు. నిజానికి కీర్తన నల్లగా ఉన్నా కళ గల మొహం,…
Read More

జయలలిత గారు దీపావళి పండగను ఎందుకు జరుపుకోలేదో మీకు తెలుసా

జయలలిత గారు దీపావళి పండగను ఎందుకు జరుపుకోలేదో మీకు తెలుసా టిప్పుసుల్తాన్ 1790 నరకచతుర్దశి రోజు రాత్రి మేల్‌కోటే ఆలయ ప్రాంగణంలో 800 మందిని నిర్దాక్షిణ్యంగా వధించిన ఘటన మీకు తెలుసా...?? 1790లో నరకచతుర్దశి రోజు అర్థరాత్రి సమయంలో టిప్పుసుల్తాన్, తనకు అత్యంత నమ్మకస్తులు, అత్యంత క్రూరులైన సహచరులు, సైన్యంతో కలిసి మెల్కోట్ ఆలయానికి చేరుకున్నాడు.. అప్పటికి ఆ ఆలయంలో సుమారు 1000 మంది భక్తులు నరక చతుర్దశి పండుగ ఊరేగింపును జరుపుకుని ఆనందంగా ప్రసాదాలు భుజించి విశ్రమించడానికి సిధ్దమౌతున్నారు.. టిప్పు ఆలయానికి చేరుకుని ఆలయ తలుపులు, ద్వారాలు మూసివేసి, 1000 లో 800 మందిని ఊచకోత కోశాడు, పసిపిల్లలు అనికూడా దయ లేదు.. 200 మంది సుందర స్త్రీలను బంధించాడు, మరుసటి రోజు ఉదయం అంటే, దీపావళి. అప్పుడు ఈ నర హంతకుడు, మెల్కోట్ ఆలయాన్ని కూలగొట్టి, సంపదను కొల్లగొట్టాడు. ఆలయ సంపదను తరలించడానికి 26 బలమైన ఏనుగులు, 180…
Read More

ఏకమ్ సినిమా రివ్యూ?

ఏకమ్ సినిమా రివ్యూ -రేటింగ్ ? సమాజం గురించి ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు దాన్ని సూటి గా సుత్తి లేకుండా చెప్పాలి. అలాగే దేవుడు గురించి , అతని లీలల గురించి చెప్పాలన్నా కూడా సూటి గా చెప్పాలి. కానీ అన్ని కథలు కలగాపులగంగా చేసి , కలగూర గంప లా చెప్తాం అంటే రెంటికీ చెడ్డ రేవడిలా తయారయింది ఈ సినిమా కథ . ఇంతకీ కథ ఎంటి ? కథ ఏంటి! జీవితం లో అందర్నీ కోల్పోయి, ఉద్యోగం లేకుండా నా రూటే సెపరేటు అంటూ ఆనందం వెతకడానికి వెళ్ళే హీరో లాంటి అబ్బాయి. ప్రియుడు మోసం చేయడం తో పాటు తన వీడియో నెట్ లో రావడం తో చావు ను వెతుకుతూ వెళ్ళే ఒకమ్మాయి. కాఫీ షాప్ పెట్టుకోవాలని లక్ష్యం తో పాటు పడే ఇంకో అమ్మాయి. ఆమెకు హెల్ప్ చేసినట్టు నటిస్తూ తనను తన…
Read More

కుక్క బతుకు పార్ట్ 4

కుక్క బతుకు పార్ట్  4 పొద్దున ఒక మటన్ ముక్క దొరికింది కాబట్టి ఎలాగో ఇప్పటి వరకూ ఉండగలిగాను. ఇప్పుడు టైం ఎంత అవుతుందో పన్నెండు దాటీ ఉంటుందా.. హా ఉండే ఉంటుంది లేకపోతే నా కడుపులో గొకదు కదా.. మళ్ళీ ఎక్కడ వెతుక్కోవాలో ఏమో కనీసం సగం కడుపైనా నిండుతుందో లేదో తెలియదు. ఏ మహానుభావుడూ ఇంత దయ చూపించక పోతాడా, కనీసం ఒక ముద్ద అయినా వేయకపోతాడా, ఇంతగా ఎదురు చూస్తున్నా, ఒక్కరూ కూడా వేయకుండా పోతారా ఆ మాత్రం జాలి దయ అనేవి మనుషుల్లో కరువై పోయాయా... అబ్బా ఇంకెంత దూరం నడవాలి.. అయ్యో ఆకలితో పేగులు లుంగ చుట్టుకు పోతున్నాయి. అరే అక్కడేదో బండి కనిపిస్తుంది. అక్కడికి వెళ్తే అయినా కాస్త ముద్ద పెట్టక పోతారా, వెళ్లి చూద్దాం, అయ్యో అప్పుడే సర్ధేస్తున్నాడు. వెళ్ళి అడుగుతా.. హమ్మయ్య వేస్తున్నాడు. అయ్యో చాలా ప్లేట్ లలో టిఫిన్స్…
Read More

పంచాంగము 20.01.2022

పంచాంగము 20.01.2022 విక్రమ సంవత్సరం: 2078 ఆనంద శక సంవత్సరం: 1943 ప్లవ ఆయనం: ఉత్తరాయణం ఋతువు: హేమంత మాసం: పుష్య పక్షం: కృష్ణ-బహుళ తిథి: విదియ ఉ.07:34 వరకు తదుపరి తదియ వారం: గురువారం- బృహస్పతివాసరే నక్షత్రం: ఆశ్లేష ఉ.08:12 వరకు తదుపరి మఘ యోగం: ఆయుష్మాన్ ప.03:03 వరకు తదుపరి సౌభాగ్య కరణం: గరజ ఉ.07:37 వరకు తదుపరి వణిజ రా.07:56 వరకు తదుపరి భధ్ర వర్జ్యం: రా.08:45 - 10:25 వరకు దుర్ముహూర్తం: ఉ.10:34 - 11:19 మరియు ప‌.03:04 - 03:49 రాహు కాలం: ప‌.01:51 - 03:16 గుళిక కాలం: ఉ.09:38 - 11:03 యమ గండం: ఉ.06:49 - 08:14 అభిజిత్: 12:05 - 12:49 సూర్యోదయం: 06:49 సూర్యాస్తమయం: 06:04 చంద్రోదయం: రా.08:13 చంద్రాస్తమయం: ఉ.08:34 సూర్య సంచార రాశి: మకరం చంద్ర సంచార రాశి: కర్కాటకం దిశ శూల: దక్షిణం…
Read More

ఆనందం కోసం ఎక్కడ వెతకాలి?

ఆనందం కోసం ఎక్కడ వెతకాలి? ఆనందం, సంతోషం కోసం ఎక్కడెక్కడో వేతకనవసరం లేదు... నిజమైన ఆనందం స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకున్నప్పుడు దోరుకుతుంది... అరిటాకులో ఉపవాసం రోజు భోజనం చేసినప్పుడు దోరుకుతుంది... ప్రశాంత వాతావరణంలో ఉన్నప్పుడు దోరుకుతుంది... దైవ సన్నిదిలో ఉన్నప్పుడు దోరుకుతుంది... ఒక మంచి పని చేసినప్పుడు దోరుకుతుంది... దోరికిన వస్తువు తిరిగి ఇచ్చినప్పుడు దోరుకుతుంది... ఇతరులకు ఒక చిన్న సహయం చేసినప్పుడు దోరుకుతుంది... ఇతరుల సమస్యకు పరిస్కారం చూపినప్పుడు దోరుకుతుంది...
Read More