అవసరమైన వారికి
సాయం అనేది ఖచ్చితంగా అవసరమైన వారికి చేయాలి .
సాయం పేరుతో ధర్మం పేరుతో అడుక్కునే వాళ్ళందరికీ రూపాయలు వేసి వాళ్ళని ముష్టి వాళ్ళగా తయారు చేయకూడదు.
ఎప్పుడైతే వేసే వాళ్ళు ఉంటారో !అడుక్కునే వాళ్ళుగా తయారవుతారు !ప్రభుత్వం ఎన్ని సహాయాలు చేస్తున్నా అడుక్కుటున్నారు మనం వేయాల్సిన పనిలేదు..
పని చేయకలిగిన వాళ్లు కూడా అడుక్కుంటున్నారు అంటే ఇది మనం చేసే అపాత్ర దానం వలననే.
సాయం అంటే నిజంగా కష్టంలో ఉండి ఆపదలో ఉంటే చేయాలి .
లేక హాస్పటల్లో వైద్యం కోసం డబ్బు ఇబ్బంది పడుతుంటే సాయం చేయాలి ..
ఇబ్బందితో చదువు ఆపేయాల్సిన పరిస్థితి వచ్చిన వాళ్ళకి మన శక్తి మేరకు సాయం చేయాలి.
నిజంగా ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు ఆ పరిస్థితుల నుండి కాస్త కోలుకోవడానికి అనుకూలతను బట్టి సాయం చేయాలి .
సాయం చేయాలి అది ఉదార బుద్ధితో సాయం చేయాలి మళ్లీ దాని నుండి ఎలాంటి ఆపేక్ష లేకుండా సాయం చేయాలి అప్పుడే ఆ సహాయానికి విలువ
అది అపాత్ర దానం కాకుండా ఉంటుంది .
మీరు ముష్టి వాళ్లకు డబ్బులు వేయకండి మనది ముష్టి దేశంగా ఎదగనివ్వకండి.
సాయం చేసి గుర్తు ఉంచుకోకండి …
సాయం పొంది మరువకండి సదా కృతజ్ఞతతో ఉండండి. .
– ఆలపాటి సత్యవతి