ఆయుధం

ఆయుధం

ఆయుధం

ఎక్కడమ్మా నీకు రక్షణ
ఓ నిర్బయా,అభయా,
ఆయోషా,ఆసిఫా…
నువ్వేవరైతే ఏమి
ఈ భువిలో…
అమ్మ గర్భంలో నువ్వు
రూపుదిద్దుకోక ముందే
ఆడపిల్లవని గర్భంలోనే
నిన్ను చిదిమేసే కసాయి
తల్లిదండ్రులున్నారు
ఈ లోకంలో….
జాగ్రత్త తల్లి జాగ్రత్త…
నువ్వు పుట్టాక ఎదిగీ
ఎదగని నీ చిరుదేహాన్ని
మందంతో కాటేసే కామాంధులు
ఉన్నారు ఈ లోకంలో
జాగ్రత్త తల్లీ జాగ్రత్త…
కులాంధత్వం,మతమౌఢ్యం,
కక్షలు, కార్పణ్యాలు,
అన్నీంటీకీ ప్రతీకారం…
తీర్చుకోవడానికి నీ దేహాన్నే
వేదిక చేసుకునే మానవ
మృగాలున్నాయి ఈ లోకంలో
జాగ్రత్త తల్లీ జాగ్రత్త…
అమ్మ ఒడిలో,చదువుల బడిలో,
ఆఖరికి….
దేవుడి గుడిలో కూడా
నీకు లేదమ్మా రక్షణ..
దుష్టశిక్షణ, శిష్టరక్షణ
కావించాల్సిన దేవుని ముందే
నీపై జరిగే మృగ దాడులకు
చలించని ఆ దేవుడు
రాతిబొమ్మే అని తేలిపోయాక
ఇంకెక్కడ తల్లీ నీకు రక్షణ…
ఇకపై తల్లి పేగునించీ నీ
బొడ్డు తాడుకు చేరాల్సింది
ఆహారం కాదు, అంతకంటే
ముందే చేరాలి నీలో
ఆత్మవిశ్వాసం, అన్యాయాన్ని
ఎదుర్కునే శౌర్యం…
ఆదినుండి పోరాటమే
కావాలి నీ ఆయుధం.”..

-గురువర్ధన్ రెడ్డి

అను.. బంధాలు Previous post అను.. బంధాలు
నిరీక్షణ Next post నిరీక్షణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close