బాధ్యత

బాధ్యత

నువ్వు బాధ పడితే చూడలేరు
నీ మంచి కోసం వాళ్ళు ఎన్ని 
త్యాగాలైనా చేస్తారు…
నీ ఆకలి తీర్చి వాళ్ళు ఆకలితో
గడిపిన రాత్రులు ఎన్నో..
నీ భవిష్యత్తు కోసం వాళ్ళు
ఎంతో కష్టపడతారు…
నీకంటే వాళ్ళకి ఎవరూ ఎక్కువ కాదు…
అమ్మ కడుపులో తొమ్మిది నెలలు మోస్తే
నాన్న తన భుజాల మీద మోస్తూ ఉంటాడు…
నువ్వు ఒక మంచి స్థాయిలో ఉండాలని
ఎంతమంది దేవుళ్ళకు మొక్కుతారో వాళ్లకే తెలీదు..
వాళ్ళకి ఒక వయసులో నీ అవసరం ఉన్నప్పుడు
నువ్వు వాళ్ళని బాధ్యతగా భావించాలి తప్ప
భారంగా మాత్రం చూడకు..
నిన్ను చిన్నతనం నుంచి ఎంతో
బాధ్యతగా చూసుకున్నారు..
తల్లిదండ్రుల గొప్పతనం గురించి
ఎంత చెప్పినా తక్కువే…
వాళ్లకి ఒక బాధ్యతగా భావించి
వాళ్ళని బాగా చూసుకోవాలి..

⁠- మాధవి కాళ్ల

Related Posts