బాధ్యత

బాధ్యత

ఆ.వె

1) భావి భరత మాత బాలల జీవితం
    మొగ్గలోనె వాడి మోడు లయ్యె
    పలక బలపము విడి పలుగు పారలు బట్టె
    స్వార్థపరుల పనికి సాక్ష్య మిదియె

ఆ.వె.

2) ఇంజనీరు జదివి ఇండియా గౌరవం
     ఇనుమడింప.దేశ మేలు బాల
     లన్ని వనరులుండి అల్లుని శనిలాగ
     చిన్న పిల్లలంత చిక్కు బడిరి

ఆ.వె.

3) పాలన సరిజేసి.ఫలితాలు దేశాన్ని
     ముందుకు నడిపించు ముద్దు బిడ్డ
     ఆదిగురువు తల్లి ఆరాటపడుచుండె
     ఎండలోన కంకరెత్తుకుంటు

ఆ.వె.

4) భారత సరిహద్దు బాధ్యత నెరవేర్చు
    జై “జవాను” ఒకడు జయము కూర్చు
    విద్య.బుద్ధి నేర్చివైద్యుడౌ నొక్కడు
    బాల కార్మికులుగ బంధి యయ్యె

ఆ.వె.

5) ఆ నలుగురు దేశ ఆర్థిక సంపద
    పెంపు జేసి తీరు పెద్ద లయ్యి
     పసివయసున బాల బంగారు భవిషత్తు
     పాడుజేసె పందికొక్కులంత

 

– కోట

Related Posts