బాల కార్మికులు

బాల కార్మికులు

బంగారు జీవితం..బొగ్గులమయం
పసి హృదయాలు.. వెట్టిచాకిరి కి నిలయాలు

వికసించని లేలేత మొగ్గలు..
పూర్తిగా ప్రకాశింపని రవి కిరణాలు
ఆపన్నహస్తాలకై గగ్గోలు..
ఏ ఆపద్భాందవుడైనా చెవి యొగ్గేనా..

సరస్వతి కటాక్షం కరువై..
కుటుంబ జీవితం బరువై..
బానిసత్వం శాపమై..

ముక్కుపచ్చలారని మల్లె వంటి జీవితం
నిరంతర శ్రామికవాడలకు అయ్యింది అంకితం..

బంగారు పాపలు..
రేపటి దేశపు వెలుగులు.
నేడు శ్రమలో కాలుతూ..
తమ కుటుంబానికి వెలుగునిస్తూ
ఆద్యంతం నలిగి రగులుతున్న బాల్యం..

ప్రశ్నార్థకమైంది దేశ భవిష్యత్తు..
ఎప్పటికి మారేనో ఈ జగత్తు..

– కిరీటి పుత్ర రామకూరి

Related Posts