బాల్యం

బాల్యం

బాల్యం తాలుకు చేదు గుర్తుకు ఇదో గుర్తు
ఎవరన్నారు బాల్యం మధురమని
సాహసించగలరా చెప్పేందుకిప్పుడు
నా ఈ స్థితి గురించి మాట్లాడాలా?
ఈ స్థితికి కారకులైన వారి గురించి
ఆలోచించాలా?
ఏమీ అర్థం కాని పరిస్థితి నాది.
కడుపులో ఆకలి బరువు ముందు
మోస్తూన్న తలపై భారం ఏ పాటిది
నా ఈ అమాయకపు చూపులున్నవి
ప్రకృతి అందాన్ని ఆస్వాదించేందుకు కాదు
నా నిస్సహయస్థితిని మీకు తెలిపేందుకే!

– బానోతు రామ్ నాయక్

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *