బడి జ్ఞాపకాలు

బడి జ్ఞాపకాలు

బడి జ్ఞాపకాలు

బడిలో నేర్చుకున్న ప్రతి విషయాన్ని
నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనివి…
బడిలో నేర్చుకున్న పాఠాలను జీవితంలో
ఎలా బ్రతకాలో నేర్పిస్తాయి..
జీవిత పయనంలో ఎదురయ్యేన
ఆటు , పొట్లు , చేదు అనుభవాలను
మిగిల్చే గుణపాఠాలను నేర్పిస్తాయి..
పుస్తకాలతో స్నేహం ,
మచ్చలేని మనుషులు ,
ఏకాగ్రత లోపించని వయసు ,
మన చేసిన అల్లరి ,
కష్టపడి చదువుకున్న రోజులు ,
ఇష్టంగా బడిలో నేర్చుకున్న పాఠాలు…
బడితో మనకి ఎన్నో అనుభవాలు ఉన్నాయి…
చిన్న చిన్న తప్పులు చేసి ,
తల్లిదండ్రుల దగ్గర దొరికిపోవడం ,
మేము చేసింది తప్పు అని తెలిసి చాలా బాధ పడేవాళ్ళం…
బడిలో చేసిన స్నేహాలు ,
తప్పు చేస్తే దండించే టీచర్స్,
బడి ఆవరణం మొత్తం చెట్లు ఉంటాడం…
బడిలో నేర్చుకున్న పాఠాలను
నా జీవితంలో ఎప్పటికి మరచిపోలేను…
ఆనాటి బాల్యం , జ్ఞాపకాలు, చేసిన అల్లరి, ఆడిన ఆటలు ఎప్పటికి మరవలేనివి…
బడి జ్ఞాపకాలు నన్ను వెంటాడే తుమ్మెదలా ఉన్నాయి..

⁠- మాధవి కాళ్ల

బడి విద్య Previous post బడి విద్య
ఆత్మీయ కలయిక Next post ఆత్మీయ కలయిక

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *