బహురూపి

బహురూపి

చిత్రమీ జీవితం
సామాన్యుడికేమో
నాలుగు ముద్దలు దొరకాలంటే
శ్రమే సౌఖ్యమంటుంది

కొండలు కరిగించేవారి
అడుగులకు మడుగులొత్తుతు
మహా సిగ్గు పడుతుంటుంది
ధన్యక్షణాలను లెక్కిస్తుంటుంది

పురివిప్పిన నెమలిలా
శ్రమ సౌందర్యమో
సామూహిక జీవనగానం
అభిమానాల కొలమానమని
కవి తృప్తి పడుతుంటాడు

కంటి చూపుతో శాసించే
కాసుల వర్గం
ఆనంద క్షణాలను గాలిస్తుంటుంది
ఆధ్యాత్మికత ఆసరాతో ఇహపరాలను జయిద్దామనుకుంటుంది

అసమానతలు కొత్తవికావు
ఆకలి బాధలు తీరేవికావు
భిన్నరూపాల ప్రపంచం
అర్థం కాని సమాంతరదారులతో
జీవితమో బహురూపి

– సి. యస్. రాంబాబు

Related Posts