"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

బలహీన పరుచుకోకు

బలహీన పరుచుకోకు

ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను
నాకు తోడుగా ఉన్న చెట్లన్ని నరికేశారు
ఇక్కడ నేను ఒక్కదాన్నే మిగిలిపోయి ఉన్నాను

త్వరలోనే నన్ను కూడా నరికేస్తారు..
ఈ పంచభూతాలలో నేను ఒకదాన్ని అయినా
సుదీరమైన ప్రాంతంలో నేను ఒంటరిగా ఉన్న
ఈ మనుషులకు నేను ఎంత ఉపయోగపడినా
ఈ సుదీరమైన ప్రాంతంలో ఒంటరిగా మిగిలిపోయాను..
నాకంటూ ఒక మనసు ఉందని గ్రహించలేక
ఎప్పుడు కూలిపోతానో తెలీదు
విత్తనం నాటి దగ్గర నుంచి మొక్కగా మారి
ఎన్నో పండ్లను ఇచ్చిన
ఋతువులు మారిన ప్రతిసారి నా చెట్టు ఆకులు రావడం మొదలుపెట్టాయి..
రాత్రి సమయంలో  నా మీద మంచు కురుస్తూ ఉంటే
నేను తట్టుకొని గట్టిగా నిలబడిన
ఎప్పుడో ఒకప్పుడు కూలిపోక తప్పదు..
మనుషులు కూడా తమ సమస్యల్లో
అధైర్య పడకుండా పరిష్కరించుకోవాలి కానీ
నిన్ను నువ్వు బలహీన పరుచుకోకు..
సుదూరమైన ప్రాంతంలో ఒంటరిగా ఉన్న చెట్టు ఎలా అయితే అన్ని రుతువుల్ని తట్టుకుంటూ గట్టిగా నిలబడిందో
అలాగే మన జీవితంలో జరిగే ప్రతీది అలాగే ఎదుర్కోవాలని నేను అనుకుంటున్నాను..

– మాధవి కాళ్ల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *