బాలు రైటర్ -మొదటి భాగం

బాలు రైటర్ -మొదటి భాగం

కాఫీ షాప్ లో ఆ విజయ్ కోసం వైట్ చేస్తూ బోర్ కొట్టి బైటికి వచ్చాను. ఒక సిగరేట్ తాగుదాం అని పక్కనే ఉన్న బడ్డీ కొట్టుకు వెళ్తున్నా ఇంతలో ఒక లారీ సమాన్లతో వెళ్తూ ఉంది. అందులో నుండి ఒక బ్యాగ్ పడిపోయింది.

అది పిలిచే లోపే వెళ్ళిపోయాడు. సరే ఏముంది అందులో చూస్తే ఒక డైరీ సగం గీసిన బొమ్మలు. ఒక అద్దం కూడా ఉంది.

ఈలోపు విజయ్ వచ్చాడు బ్యాగ్ తీసుకొని కాఫీ షాప్ కి వెళ్ళాను. కాఫీ తాగుతూ విజయ్ అడిగాడు ఎవరిది ఆ బ్యాగ్ అని ఇలా దొరికింది అని చెప్పాను. ఏముందో చూద్దాం చదువు అన్నాడు. ఇంకొకరి డైరీ అంటే పక్క వాడి జీవితంలో కి తొంగి చూడటం లాంటిది అని రాసివుంది. ఏంట్రా ఈ వార్నింగ్ అవసరమా పని ఉంది పద అని వెళ్ళాము కానీ ఆ డైరీ దాచేసి పనిలో పడ్డ.

ఆ రోజు బాగా అలసిపోయిను నిద్రలోకి జారుకున్న. కానీ మధ్యలో కరెంట్ పొయింది. మళ్ళీ మెలకువ వచ్చి నాకు సరే ఏం అవుతుంది అని చదువుదాం అని అనుకుని డైరీ తెరిచిన తరువాత కరెంట్ వచ్చింది.

నా మది లోని భావాలు ఎవరికి చేపలేనివి నా లో దాచుకున్న భవలను ఇందులో దాచుకున్న ….. ఇంకా చాలా రాసింది. నేను నవ్వుకుంటూ ఎవడ్రా వీడు ఇంత రాసాడు అని అనుకున్నాను. చూద్దాం ముందుకు పోతే తెలుస్తుంది అని.

ఇంట్లో అందరూ ఉన్నరూ నన్ను బాగా చూసుకుంటారు అమ్మ ప్రేమ, నాన్న ధైర్యం, చెల్లి తో ఆటలు అలా సాగేది జీవితం ☺️. నేను కాలేజ్ కి వెళ్లి వచ్చే దారిలో ఒక హాస్పిటల్ దగ్గర పాప ఏడుస్తూ ఉంది. నేను వెళ్దాం అనుకున్న ఇంతలో ఇంకో అమ్మాయి వచ్చి తనతో మాట్లాడి తనని వాళ్ళ అమ్మ కి తీసుకెళ్లింది.

కానీ ఎక్కడో చూసిన జ్ఞాపకం. పరిక్షలు దగర్లో ఉన్నాయి అని చదవటం మొదలు పెట్టాను. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ఎవరు అని వెళ్లి అమ్మ తలుపు తీసింది. కొత్తగా పక్కన ఇంట్లో అద్దెకు దిగారు అని చెప్పి పాలు పొంగిస్తున్నాము మీరు రండి అని వెళ్ళింది. తన పేరు చెప్పలేదు ఎలా అని ఆలోచించన లో పడ్డా.

తను బైటికి వెళ్లే సమయంలో వాళ్ళ అమ్మ హారిక అని పిలిచింది. పేరు విని పొంగపోయాను. పరీక్షలు అయిపోయాయి ఇంట్లో వాళ్లు ఎదో ఒకటి నేర్చుకో అంటే డ్రాయింగ్ క్లాస్ లో చేరాను. ఆశ్చర్యంగా తను కూడా చేరింది. తనని ఎదురుగా చూడలేక అద్దంలో నుండి తనని చూడటం అలవాటు చేసుకున్న కానీ తనతో ఎం చెప్పాలి ఎలా అని ఆలోచించ .

తర్వాత నా స్నేహితుడు కి ఇది చెప్పాను. ముందు స్నేహం చేయాలి నచ్చితే ప్రేమ అని . మళ్ళీ ఆలోచన సరే ఒక చిన్న ఉత్తరం రాసి ఇచ్చాను. తనికి ఇచ్చాను తను చదివి స్నేహుతురాలిగా ఉంటా అని చెప్పింది. కానీ తనకు నా రాతలు ఇష్టం అని తరవాత తెలిసింది.

తానే వచ్చి కొన్ని విషయాలు చెప్పి వాటి మీద ఒక ఉత్తరం అడిగింది అని. ఇది విని తను ఏడుస్తూ తనకి కావాల్సిన ఉత్తరం రాసి ఇస్తాడు. అది హారిక ఎవరికి ఇస్తుందా అని తన వెనుక వెళ్ళాను. అతను ప్రేమించిన అబ్బాయి అది చూసి బాధ్యతపడతాడు. కొద్దీ కాలం మౌనంగా ఉండి మళ్ళీ . చదువు పూర్తి చేసి చెల్లి పెళ్లి , అమ్మ,నాన్న కాలం చేయటం.

సుఖం తరువాత కష్టం ఇదేగా జీవిత చక్రం. ప్రేమ లేదు ప్రేమించిన వాళ్ళు లేరు. బాగా ఏడ్చాను దేవుడి మీద కోపం వచ్చింది. ” రాసె కళ ఇచ్చిన దేవుడు మాట మాత్రం లేకుండా చేసాడు.” ఇప్పుడే ఆ రాతే తిండి పెడుతుంది. ఒక పత్రిక లో సంభాషణలు రాసె ఉద్యోగం బొమ్మలు ఇస్తారు వాటికి సంభాషణలు రాయటం. అప్పుడప్పుడు కొన్ని కథలు …

రేయ్ లెవరా ఇంకా నిద్ర ఏంటి అని అమ్మ నిద్రలేపింది. ఏంట్రా ఎప్పుడు లేనిది బుక్ చదువుతున్నావు బుక్ కాదు అమ్మ డైరీ అని చెప్పాడు. స్నానం చేసి రా అని చెప్పి తను రూమ్ క్లీన్ చేస్తూ ఉంది . ఎందుకో గాలికి ఆ డైరీ ఓపెన్ అయింది అందులో పెరు చూసి ఆశ్చర్య పోయింది.

– సంచారి

Previous post ప్రార్థన
Next post ఎంతహాయిగుందే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *