బంధాల భాగ్యరేఖ..

బంధాల భాగ్యరేఖ..

 

కుటుంబ విలువలు
వసుదైక కుటుంబం లో
అంతులేని మనిషి కథకు
ఆది అంతం కుటుంబమే

పుట్టుకతోనే బంధాన్ని
పెనవేసిన వైనం సమస్త
జీవరాశిమనుగడ .

అమ్మ పంచే ప్రేమ అమృతమయం
నాన్న చూపే బాధ్యత
అమూల్యమైనది
అన్నదమ్ముల అనుబంధం
వెన్నంటే రక్షణ
అక్కాచెల్లెళ్ళు ఆత్మీయత
అంతులేని అబిమానం
వరుసలతో పిలుపులు
వన్నేతెచ్చే ప్రేమలు
ఇష్టాలను పంచుకోవడం
కష్టాలను చెప్పుకోవడం
ఆకలితెలియని రోజులైనా
అసహాయస్థితి లో నైనా
కుటుంబమే బలం
కష్టంలో అయినా
నష్టంలో అయినా
బలహీనతే కుటుంబం
బిన్నబిప్రాయాల వూసులైన
పరిధుల చక్రమైనా
నిస్వార్థంగా అలోచిందేది
కుటుంబమే
అనుభవాల ఆదేశాలైనా
పెంచుకునే గౌరవమైనా
కుటుంబం తోనే
కలతలులేని
కుటుంబం లేదు
కలలు కనని మనిషి లేడు
విలువైన కాలంలో
అనుబంధాల ఆటలతో
మర్చిపోలేని అనుభూతి తో
వెలకట్టలేని విలువలతో
సాగిపోయే సంసారపు
జీవితంలో
ఎల్ల వేళలా మనకోసమే
వేచిచూసే ప్రేమ బంధమే
కుటుంబం
విజేతలైన విదేయులైనా
కుటుంబం తోడుంటేనే
రూపు దిద్దు కుంటుంది
బంధాల భాగ్యరేఖ…….

– జి జయ

Related Posts