బంధం పార్ట్ 1

బంధం పార్ట్ 1

 

ఆమె పిలుపు గంట కొట్టినట్లుగా వినిపించింది ఒసేయ్ విశాల పొయ్యిమీద పాలు పొంగుతున్నాయేమో చూడు అంటున్న అత్తగారి పిలుపుకు విశాల, నేను పనిలో ఉన్నా మామగారి పట్టు పంచలు ఉతుకుతున్నా రాలేను అన్నది.

ఒసేయ్ సావిత్రి నువ్వైనా రావే పాలు పొంగుతున్నాయేమో చూడు, నేను బాత్రూంలో ఉన్నా బాబు తో వాడికి చాలా ఇబ్బంది ఉంది అండి అంది సావిత్రి గట్టిగా…

ఒసేయ్ నిద్ర మొహం దాన నీవైన రావే, నేనేమో పొయ్యి దగ్గర ఉన్నా అట్లు వేస్తున్నా, మళ్లీ మీ నాన్నగారు తిడతారు. ఇంకా చేయలేదా అంటాడు, విసుక్కుంటారు.

అప్పుడే శిరీష తన గదిలో నుంచి వస్తూ నువ్వే చూడవచ్చు కదమ్మా అంది. ముందు నువ్వు పాలు చూడు తర్వాత నాతో గొడవ పడు అంటూ తన పని తాను చేస్తూనే ఉంది కామాక్షి.

మారు మాట్లాడకుండా వెళ్లి పాల గిన్నె దింపి పక్కన పెట్టి అమ్మ పాలు కాగాయి, పక్కన పెట్టాను అంది సిరి. అయితే వెళ్లి మొహం కడుక్కుని రా కాఫీ చేస్తాను అంటూనే చేసిన అట్లు గిన్నెలోకి సర్ది, పొయ్యి దగ్గర నుంచి లేచి కాఫీ కోసం గిన్నె తీసుకుని వచ్చి ఆ కాఫీ కలపడం లో నిమగ్నమైంది. తల్లి దిక్కు ఒకసారి చూసి పెరట్లోకి నడిచింది శిరీష.

అన్ని అయినట్లేనా కాముడు అంటూ తువ్వాలతో మొహం తుడుచుకుంటూ వంట గదిలోకి వచ్చిన భర్తను చూసి, అయినట్లే మీరు అట్లు తిని కాఫీ తాగడం ఆలస్యం అని మనసులో విసుక్కుంటూ అంది కామాక్షి.

రఘురాం గారు పంచ కట్టుకుని వచ్చేసరికి పీట పెట్టి, ప్లేట్ పెట్టి టమాటా పచ్చడి వేసింది. రఘురాం గారు పిట ముందు కుర్చుని  తన ముందు పెట్టిన ప్లేటును ముందుకు లాక్కున్నాడు తినటానికి సిద్ధమైన వాడిలా..

నాలుగు తిన్న తర్వాత పెద్ద గ్లాస్ తో కాఫీ తెచ్చి ముందు పెట్టి నిలబడింది కామాక్షి. ఇంకా ఏమైనా కావాలా అని చూస్తున్నట్టు. కాముడు అట్లు బాగున్నాయి ఇంకొక రెండు అట్లు వేయి. చాలా బాగున్నాయి అని వినగానే పక్కనే ఉన్న మరో రెండు అట్లు తీసివేసింది.

అవి తినడం పూర్తయిన రఘురాం గ్లాసులో నీళ్ళు తాగి కాఫీ గ్లాసు తీసుకుని ఏమైనా నీ చేతి వంట అమోఘమే అంటున్న భర్త మాటలకు పొంగిపోయిన కామాక్షి చాలు, నన్ను మెచ్చుకోవడం కాదు మీ ముద్దుల బిడ్డ కు బుద్ధి చెప్పండి. ఎనిమిది గంటలకా అది నిద్రలేవడం ఎవరైనా వింటే బాగుంటుందా అంది కామాక్షి.

ఎందుకే అలా అంటావు? అది రేపు అత్తారింటికి వెళ్లాక నీలాగే అందరికీ చేసి పెట్టుకోవాలి కదా మన ఇంట్లో అయినా దాన్ని సుఖపడనీ అని అన్నాడు నిష్టూరంగా. మీరు అలాగే వెనకేసుకు రండి అది ఇంకా మొండిగా తయారవదూ.. పిట మించి లేస్తున్న రఘురాం నేను అలా బజార్ వరకు వెళ్లి వస్తాను నిన్న పురుషోత్తం కలవాలని అన్నాడు వెళ్తున్నా…

గదిలోనుంచి బయటకు వెళ్లి కొక్కానికి ఉన్న కమిజు వేసుకుంటూనే బయటకు వెళ్లి వరసలో ఉన్న చెప్పులు వేసుకుని వెళ్తున్న భర్తను చూస్తూ ఆమె మనసులో ఏం పిల్లలో ఏమో అంతా నా ఖర్మ అనుకుంది. భర్త తిన్న ప్లేటు తీసుకుని గచ్చులో పెట్టి వచ్చింది.

మిగిలిన అట్లు, టమాటా పచ్చడి అన్ని తీసుకొని వచ్చి పొయ్యి దగ్గర అంతా సర్ది వచ్చి, బొగ్గుల పొయ్యి మీద గిన్నె పెట్టి వేడిగానే ఉంటుందిలే అని అనుకుంటూ వేడి నీళ్లు ఉన్నాయో లేవో పొద్దుననగా పెట్టాను అనుకుంటూ పొయ్యి ముట్టించి, బావిలోంచి నీళ్లు తోడి, కొప్పెరలో పోసి నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టారో,  లేదో, పిల్లలు వాళ్ళు స్నానాదికాలు ముగించుకుని వచ్చేసరికి ఇంకా ఎంతసేపు అవుతుందో అనుకుంటూ పెరటిలోకి వెళ్ళింది కామాక్షి. సావిత్రి  బావిలో నీళ్లు తోడుతుంది.

విశాల, సావిత్రి పోసిన నీటిని కొప్పెర లో పోస్తోంది. శిరీష స్నానం చేసి బట్టలు వేసుకుని లోనికి రాబోతున్నదల్లా తల్లిని చూసి ఆగి, అమ్మ నీకు వేడి నీళ్లు లేవు, ఇప్పుడే వదిన పోసింది అంటూ తల్లిని దాటుకుంటూ లోపలికి వెళ్ళింది శిరీష.  అత్త గారిని చూడగానే కోడళ్ళు ఇద్దరూ అయ్యో అత్తగారు నీళ్లు ఇంకా వేడిగా లేదండి ఇప్పుడే పోసాను అంది సావిత్రి.

సరేలే మీరు వెళ్ళండి నేను స్నానం చేసి వస్తా, బొగ్గుల పొయ్యి మిద కాఫీ ఉంది. మీకు ముందు కాఫీ తాగితే కానీ ఏం తినరు కదా వెళ్లండి, వెళ్లండి అంది కోడలితో. తన పెద్ద కోడలు సావిత్రి బాబును చంకన వేసుకొని వెళ్ళిపోయింది.

ఆ వెనక విశాల కూడా వెళ్ళింది. కామాక్షి బాత్రూం వైపు పోయి ఒక్కసారి చుట్టూ చూసింది. బుద్ధిమంతులైన కోడళ్ళు అన్ని శుభ్రంగానే ఉంచారు అంటూ మురిసింది.

ఇంతకి రఘురాం ఎక్కడికి వెళ్ళాడు ? పురుషోత్తం ఎవరు ? రఘురాం కు, పురుషోత్తనికి ఉన్న సంభంధం ఏమిటో మనం తర్వాతి భాగం లో తెలుసుకుందాం…  

– శారదా దేవి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *