బంధీఖానా

బంధీఖానా

ఎన్నాళ్ళనీ… ఎన్నేళ్ళనీ…
కట్టుబాట్ల ఇనుప కచ్చడాలతో…
ఆచారాల ఆర్భాటాలతో…
నీ ఆధిపత్యపు అహంకారాలతో..
నా కలలను నలిపేస్తావు..?
అండదండల పేరుతో.. అరదండాలు వేసి..
నాలోని సంగీతాన్నంతా శాశ్వతంగా సమాధి చేస్తావు..
నీ కలల సాకారానికి …
నన్ను ఒక ప్రమిదను చేసి..
నీ ఆశల యజ్ఞానికి సమిదగా మారుస్తావు..
ఈ సాంప్రదాయ బంధనాలను ఛేదించుకొని…
విశాల ప్రపంచంలోని అవకాశాలను…
అందిపుచ్చుకోవాలని…
నలువైపుల నుంచి నన్ను కమ్మేస్తున్న…
కారు చీకట్లను చీల్చుకుంటూ…
స్వేచ్ఛవిహంగాన్నై…
దిగంతాలను స్పృశించాలని…
నా అశ్రుపూరిత చక్షువులు..
ఆశగా వేచి చూస్తున్నాయి..!

– శైలజ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress