బంగారం

బంగారం

ప్రేమను చూపించటం తెలిసిన నాకు,
నీకోసం ప్రేమను, లేఖలో చూపించాలనివుంది.
లేఖంతా ప్రేమనే రాయాలని వుంది.
ఎంత రాసినా, ఎన్ని రాసినా,
నాప్రేమను అణువంత రాయగలను.
నిన్ను చూసిన ప్రతిసారీ ” హాయ్” అనే పలకరింపుతో మొదలై,
అదే మొత్తం సంభాషణగా మారి, ఆ ఒక్కపదంతో ముగించినా,
ఎంతో అనుభూతిని పంచిన,
నీ పలకరింపు చేసిన అలజడి గురించి ఎంతని చెప్పను?
పెదవులు మౌనంలో, కళ్ళు ఊసులు చెప్తుంటే,
నా మనసు విన్న నీ మౌనభాషలోని భావాలు ఎలా చెప్పను?
ఎన్నో మాటలు పంచుకోవాలని,
నా మనసు చేస్తున్న అల్లరిని ఎలా ఆపగలుగుతున్నానో!
నాకే తెలియట్లేదు. అయినా, నిన్ను చూస్తూ,
నీ పలకరింపు కోసం ఎదురుచూస్తూ,
నీ తలపులతో నా మనసు నింపుతూ
నా శ్వాస, ధ్యాస నీవేనని ,
నువ్వు తెలుసుకోవాలని రాస్తున్నా. నువ్వు ఒప్పుకున్నా,లేకున్నా!
ఈ జన్మకు నా ప్రేమను నీకు తప్ప ఎవ్వరికీ పంచలేను. నీ జవాబు కోసం ఎదురుచూస్తూ, నా ప్రేమాక్షరాలమాల పంపుతున్నా
ఇట్లు
– నీ రాధ (రాధికా.బడేటి)

Related Posts

1 Comment

  1. Brilliant.
    చాలా చాలా బాగుంది రాధికా. ఇంకా ఇంకా నీ భావుకత అక్షర రూపందాల్చాలని కోరుకుంటూ… అభినందనలు, శుభాకాంక్షలు. 🙂👏👏👏👌

Comments are closed.