బతుకుసారం

బతుకుసారం

ఇగ పో బిడ్డా, ఎందాక అస్తవ్, మేము బోతం, నువ్వాగు ఇడ, పై తువ్వల తో మొఖాన్ని తుడుచుకుంటూ అన్నాడు రాములు తన కొడుకు సందీప్ తో… ఇగో బిడ్డ ఇక్కడ మంచి బువ్వ పెడ్తారంట మంచిగా తిను బిడ్డా, మస్తు పైసల్ కట్టినం, గదంతా నీ బలుపుల తెల్వాలే, సమజైందా, ఆకలి గాకున్నా తినాలే బిడ్డా ఒక్క పాలే వెడ్తరట మల్ల మన ఇంటి లెక్క ఇడ గడికి గింత దింట అంటే వెట్టరు సమజైందా.

నువ్వు ఎంత తిన్న ఒక్క పాలే తినాల, ఆకలి గాకున్నా జర భద్రం బిడ్డా, సందూకల మురుకులు వెట్టిన ఆకలి అయితే తీస్కొని తిను ఎవలికి ఇయ్యకు అంటూ తల్లి ఇంకా చెప్పబోతుంటే, ఇగ సాల్తీ ఇదే జెప్పుకుంట కుసుంటే అడ బస్ వోతది పా పా అంటూ భార్య సీతాలును తొందర జేసిండు రాములు. సీతాలు మోగని దిక్కు సూషి గబుక్కున బిడ్డ ను దగ్గరికి దీస్కొని కండ్లల్ల నీరు దియ్యవట్టే, ఏయ్ ఎందే గీ పని పాడు పాని పొరన్ని అగం జెయ్యకు గిడ సదువుకుంటే మంచి నౌఖరి అస్తది అని సుబం కొర్రా పెండ్లి కొడ్క అంటే గిదెంది పా పా పోయ్యోస్త బిడ్డా.

ఇగ అగు అంట గేటు దిస్కోని పోతాంటే అక్కడ గార్డు సెల్యూట్ కొట్టిండు గది చూసి రాములు జేబులో చెయ్యి వెట్టి వంద నోటు తీసి గార్డు చేతిలో పెడ్తు అన్నా మావొడే జర సుసుకో అన్నా అనగానే అచ్చా సాబ్ అంటూ గార్డు మళ్లీ సెల్యూట్ కొట్టాడు. గేటు మళ్లీ మూసుకుంటే తల్లిదండ్రుల వీపు లు కంటి నిండా నీటి తో నిలబడిన సందీప్ కళ్ళకు మసకగా అనిపించాయి.

స్వేచ్ఛగా ఎగిరే పక్షిలాగా నవ్వుతూ తుళ్ళుతూ తోటి పోరగాన్లతో పదవ తరగతి వరకు ఉన్న ఊర్లోనే ఆడుకుంట పాడుకుంట చదివిన సందీప్ ను ఇంటర్ ఇంగ్లీష్ మీడియం కాలేజీ అంటూ ఒక పెద్ద రెసిడెన్షియల్ కాలేజీలో తీసుకొచ్చి పడేశారు. గంట కొట్టగానే ఖైదీల లా బకెట్ పట్టుకొనే స్నానానికి వెళ్లడం గంట కొట్టగానే ప్లేట్ పట్టుకొని టిఫిన్ కి నిలబడడం అలాగే భోజనం సమయంలో కూడా గంట కొట్టగానే ప్లేట్ పట్టుకొని వెళ్ళడం.

మబ్బున ఐదు గంటలకు లేపితే రాత్రి 11 గంటల వరకు చదువు చదువు అంటూ హింసించడం వల్ల సందీప్ కి అది బందీఖానా లాగా అనిపించింది. స్వేచ్ఛగా తిరిగే పక్షిని పంజరంలో బంధించినట్టు హాయిగా చెరువులో ఈత కొట్టి చెట్లు ఎక్కి దూకి ఆడుకుంటూ పాడుకుంటూ తిరిగిన తనకు ఈ వాతావరణం బందిఖానా అయింది.
ఒక్క సందీప్ అనే కాదు ఇలా ఎందరో పసిపిల్లల హృదయాలు చిన్ననాటి నుంచే రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీలు అంటూ ఆ నాలుగు గోడల మధ్య మసకబారీ బండ భారీ ఎండిపోతున్నాయి. పసిపిల్లల నుంచి ఉండే కోమలత్వం సహజత్వం కనుమరుగైపోయి ఆ స్థానంలో హింస లాక్కునే తత్వం అణిచివేసే తత్వం పెంపొందుతున్నాయి.

*********

మామ మేము బడికి వెళ్లి వస్తాం టాటా వచ్చాక పోలేడు కథలు చెప్పాలి అంటూ తూని ఎలాగా వెళ్తున్న మనవడిని మనవరాలు చూసి పార్వతమ్మ చాలా సంతోషించింది. అయిపోయింది వాళ్లు కనుమరుగయ్యారు పార్వతమ్మ కిటికీలోంచి చూస్తూ మూగబోయింది. తను మళ్ళీ ఆ ఇంట్లో బందీ అయింది. ఇది రోజు జరిగేది పొద్దున్నే హడావిడిగా పిల్లలు కొడుకు కోడలు ఆఫీసులకి పిల్లలు బడికి వెళ్లి పోతారు.

అంత పెద్ద అపార్ట్మెంట్లో గోడల మధ్య తాను ఒక్కతి ఖైదీలా అనిపిస్తుంది. దొంగల భయమో లేదా తాను వారి మీద పితురీలు చెప్తానను కానీ కొడుకు కోడలు తనను ఆ ఇంట్లో బంధిని చేశారు. అయినా వారి పిచ్చి గాని ఇక్కడ తన మాటలు వినడానికి ఎవరు ఖాళీగా ఉన్నారు గనుక ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు పొద్దున్నే అందరు ఇళ్లల్లో ఒకే బాగోతం టిఫిన్లు టీలు పిల్లలు లేపడాలు హడావుడి పడుతూ రెడీ చేయడం పిల్లల ఏడుపులు పెద్దల మందలింపులు చెవులకి వినిపిస్తాయే గాని కళ్ళకి కనిపించవు.

ఎందుకంటే ఈ బలమైన గోడల మధ్యలో కేవలం వినిపించడానికి మాత్రమే ఉన్నాయి. తను పల్లెలో పుట్టింది పల్లెలో పెరిగింది నలుగురు మధ్యలో తిరిగింది పెద్ద ఉమ్మడి కుటుంబంలో రుద్దంతా మాట్లాడుతూ ఇల్లంతా, ఊరంతా కలియ తిరుగుతూ ఒకరి ఇంట్లోకి ఒకరు సాయం చేసుకుంటూ చాలా సందడిగా ఉండేది. మాటల పోగులే అయ్యేవి కానీ ఇక్కడ సందడిగా ఉంటుంది వాహనాల రణగుణ ధ్వనుల శబ్దాలు తప్ప మనుషుల మాటలు వినిపించవు వెళ్లి చూద్దామన్న హెల్మెట్ ముసుగులోనో లేదా కప్పుకున్న మాస్కు ముసుగులోనో వినిపించడం తప్ప ఎవరూ కంటికి కనిపించరు. పైగా బయటకు తాళం వేసుకొని వెళ్లడం వల్ల తాను బయటకి వెళ్లి అవి కూడా చూడలేదు. ఈ బలమైన గోడల మధ్యలో తాను సాయంత్రం వరకు ఊపిరి లేని మూగ పక్షుల పడి ఉండాల్సిందే గట్టిగా నిట్టూర్చింది పార్వతమ్మ.

**
ఆంటీ పొద్దున్నే గబగబా లేచింది గబగబా అన్నం కూర వండి ప్లేట్లలో ఆరబెట్టింది టిఫిన్ కూడా రెడీ చేసింది ఈలోపు అర్జున్ నిద్రలేచి మొహం కడుక్కొని రావడంతో
తనకి టిఫిన్ డేట్ అందించి టీ గ్లాసు చేతికి ఇచ్చింది అర్జున్ గబగబా టిఫిన్ చేసి టీ తాగాడు ఇందులో శాంతి బాక్స రెడీ చేసింది అర్జున్ వెళ్లి స్నానం చేసి వచ్చి , అక్క రెడీ చేసిన బాక్స్ బ్యాగ్ లో పెట్టుకొని ఆఫీసుకు వెళ్లిపోయాడు. అతను వెళ్తుండడం వెనుక నుంచి చూసిన శాంతి గట్టిగా నిట్టొచ్చింది. పాపం 20 ఏళ్ల వయసులో హాయిగా కాలేజీకి వెళ్లాల్సిన వాడు ఇప్పుడు బాధ్యతలు నడుమ బందీల మారాడు. ఇంటర్ మొదటి సంవత్సరం చదివేటప్పుడు హఠాత్తుగా తండ్రి చనిపోవడంతో ఆ ఉద్యోగం తన తీసుకోవాల్సి వచ్చింది తనకు తెలియకుండానే తాను ఒక బందీ ఖానాలో చిక్కుబడి పోయాడు.
**
పార్వతి ఎప్పుడు చదువులో ముందంజలో ఉండేది. చదువు అంటే ప్రాణం కావడంతో తల్లిదండ్రులు తన చదువుకుంటానంటే అడ్డు చెప్పలేదు దాంతో తను ఎంత చదువుకోవాలో అంత చదువుకొని తనకి ఇష్టమైన ఉపాధ్యాయ వృత్తిని చేపట్టే లోపు తల్లి హఠాత్తుగా మరణించడంతో ఇంటి బాధ్యత పార్వతి పై పడింది. తనకన్నా చిన్నవాళ్ళైనా తమ్ముడు ఇద్దరు చెల్లెళ్ల కోసం తన చదువును పక్కనపెట్టి ఇంటి పనికి అంకితం అయింది. వాళ్లకి పొద్దున్నే వండి పెట్టడం రాగానే వాళ్ల బాగోగులు చూసుకోవడం తోటి తనకు సరిపోయింది అలా పార్వతి ప్రేమ అనే బందిఖానా లో చిక్కుబడిపోయింది. తన చదువు తనకి ఇష్టమైన వృత్తి అన్ని వెనకబడ్డాయి. కాదు బానే ఇంటి పెద్దదిక్కుగా మారి మర్చిపోయింది.

పై మూడు సంఘటనలు కేవలం ఉదాహరణలు మాత్రమే.ఇలాంటివి ఈ రోజుల్లో సర్వ సాధారణం అయిపోయింది.ఒకరికొకరు సంబంధం లేకుండా ఎవరి పనుల్లో వారు మునిగి పోతుంటే , ఎవరికీ వారు ఒక చక్రంలో బిగుసుకుపోయి తమను తాము బందీని చేసుకుంటూ, ఒక యంత్రంలా తయారవుతున్నారు. ఎవరి కలలు వారికి ఉండడంలో తప్పులేదు అలాగే వాటిని నిజం చేసుకోవడంలో కూడా వాళ్ళు సఫలీకృతులు అవ్వాల్సిందే అయితే ఏదో ఒక సమస్య వల్ల ఇలా ఎవరికి వారు ఒక గిరి గిసుకొని బ్రతుకుతుండడం ఎంతో కలచివేస్తుంది.
**
ప్రణవ్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. హఠాత్తుగా తండ్రి మరణించాడు. ప్రణవ్ కి ఏం చేయాలో తోచలేదు తల్లి తాను ఇద్దరే. దాంతో తాను చదువు మానేసి తల్లికి ఆసరాగా ఉండాలని అనుకున్నాడు. కానీ ఆ తల్లి ప్రణవ్కి సాధ్య చెప్పి అతని చదువుకునేలా చూసింది. కానీ ప్రణవ్కి ఇంజనీరింగ్ చదవడం ఇష్టం లేదు ఆపకూడదని ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఏదో ఒక ఉద్యోగం లో చేరి తల్లిని చూసుకుందాం అనుకున్నాడు. కానీ అతని మనసు ఊరుకోలేదు దాంతో తన సమస్యను తన తల్లి ముందు పెట్టాడు. అమ్మ నాకు ఉద్యోగం చేయాలని లేదు. నాకు ఇష్టమైన సినిమా ఫీల్డ్ లోకి వెళ్లాలని ఉంది అక్కడ నేను రానిస్తాననే నమ్మకం నాకుంది అని తల్లితో తన మనసు విప్పి చెప్పాడు నీకు నచ్చినట్టు నువ్వు ఉండు నిన్ను బలవంతంగా ఎవరూ ఏదీ చేయించలేదు.

నా గురించి నువ్వేం ఆలోచించకు నీకు నచ్చినట్టు చెయ్యి అంటూ ప్రోత్సాహం అందించడంతో ప్రణవ్ సినిమ ఫీల్డ్ కు వెళ్లి మంచి పేరు తెచ్చుకున్నాడు కొద్ది కాలంలోనే. అతను బాధ్యతల బాధ్యతలు అనే బందిఖానాలో ఉండాలని అనుకోలేదు. ఆ చక్రంలో తాను ఇమడలేనని తనకు తాను తెలుసుకున్నాడు. ప్రొద్దున వెళ్లి సాయంత్రం ఐదు ఇంటికి తిరిగి వచ్చే ఉద్యోగం తనకు వద్దని అనుకున్నాడు కాబట్టి తనకి ఇష్టమైన రంగంలో రాణించాడు. ఒకే మూస దూర నీ బతుకు తనకు వద్దని అనుకున్నాడు కాబట్టే తానేంటో తనకు కావాల్సిందేంటో తాను ఎందులో అయితే ఆనందంగా ఉండగలడు. తానేంటో ప్రపంచానికి తెలియ చెప్పాలని అనుకున్నాడు కాబట్టే తనను తాను శిల్పి లాగా మలుచుకున్నాడు.

ఇక్కడ ప్రణవ్ కి బాధ్యతలు ఏమీ లేవు కాబట్టి ఇలా తనకిష్టమైన రంగంలోకి వెళ్ళాడు అనుకోవచ్చు. కానీ ఇదే ప్రణవ్కి బాధ్యతలు ఎన్ని ఉన్నా కూడా తనను తాను తెలుసుకున్నాడు కాబట్టి తను ఎందులో అయితే సంతోషంగా ఉండగలడు అదే పని చేసేవాడు. అయితే ఇక్కడ అందరికీ బాధ్యతలు ఉన్నాయి అందరూ ఏదో ఒక పని చేయాల్సిందే ఏదో ఒక చిత్రంలో ఉండాల్సింది కానీ విలక్షణంగా ఆలోచించాడు కాబట్టే ఇప్పుడు సినిమా రంగంలో వెలుగొందుతున్నాడు.

జాకెట్ చిరిగిందని పారవేయలేం, చొక్కా కుట్లు పోయాయని దాన్ని పక్కన వేయలేం అలాగే బాధ్యతలు ఉన్న లేదా మనలో లోపాలు ఉన్నా సరిచేసుకొని, మనమేంటో మనం తెలుసుకుని మనం ఇందులో అయితే సంతోషంగా ఉండగలము ఏదైతే మనకు ఆనందాన్ని ఇస్తుంది అనేది ముందు తెలుసుకోవాలి అందుకు ముందుగా మనల్ని మనం తెలుసుకోవాలి అలా తెలుసుకునే శక్తి మనలో ఉండాలి.

అదే సమయంలో సమస్యలతో పోరాడి ధైర్యంగా నిలబడే శక్తి కూడా ఉండగలగాలి. ఎన్ని సమస్యలు ఎదురైనా ఎదుర్కొంటూ ముందుకు సాగేలా మనల్ని మనం ప్రోత్సహించుకుంటూ , మన కలల్ని మనం నిజం చేసుకునే దిశగా మనసును మార్చుకోవాలి. మనల్ని మనం స్థిరం చేసుకోవాలి. అప్పుడే ఈ బాధ్యతల బందిఖానాల నుండి బయటకు రాగలo. ఏటికి ఎదిరిచ్చినట్టు అన్ని బాధ్యతలని పక్కన ఉంచుకొని మన కలల్ని ఎలా సాకారం చేసుకోవాలి అనే ఆలోచన కూడా మనకు వస్తుంది.

కానీ మన లక్ష్యం,మన ఆశయం, మన కోరిక ,బలంగా ఉంటే ఏదైనా మనకు అనుకూలంగా మలుచుకోవచ్చు అనేది మనం తెలుసుకోగలగాలి.అప్పుడే మన కలల్ని మనం నిజం చేసుకోవచ్చు. మన ఆశయాన్ని నలుగురికి ఆదర్శంగా చూపవచ్చు.

 

-భవ్యచారు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *