చిట్టి మరదలు

చిట్టి మరదలు

వాడిపోయిన పువ్వుల చాటున నీ మొహం దాచుకొని
నువ్వు సిగ్గు పడుతుంటే
ఆ సిగ్గులో తెలుస్తుంది నీ బిడియం నీ మొహమాటం
నీ అందం చూసి ప్రేమించాను అనుకుంటున్నావా
కానీ కాదు పువ్వు లాంటి నీ మంచి మనసుని చూసి
నిన్ను ఇష్టపడి నిన్ను వెతికి మరి పెళ్లి చేసుకున్నాను..
ఓ మరదలా నాకు మరదలు లేకపోయినా నిన్ను ఒక మరదలాగా చూసుకుంటాను…
అప్పుడప్పుడు చిలిపి పనులు చేస్తే మాత్రం
నువ్వు అందంగా బుంగమూతి పెట్టుకుంటే
నాకు ఇంకా నేను ఏడిపించాలి బుజ్జిగించాలని అనిపిస్తూ ఉంటుంది…
ఓ నా పిచ్చి మరదలా నీ మీద నాకు అమితమైన ప్రేమ ఉంది
మొదటిసారి నీ సిగ్గు చూస్తేనే పడిపోయాను..
నీ కళ్ళల్లో కనిపించే మెరుపు నా గుండెల్లో అలజడి లేపుతుంది…
ఓ నా చిట్టి మరదలా నీ కంటే నాకు ఏది ఎక్కువ కాదు..

మాధవి కాళ్ల

best telugu stories books for kids

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *