సైకిల్ తో జ్ఞాపకాలు

సైకిల్ తో జ్ఞాపకాలు

చిన్నప్పుడు సైకిల్ నేర్చుకోవడానికి
ఎన్నో ప్రయత్నాలు చేసే దాన్ని
కానీ సైకిల్ నేర్చుకోవడానికి ఎన్నోసార్లు దెబ్బలు తగిలించుకోవడం మళ్ళీ లేచి
అందరిలా సైకిల్ నేర్చుకుని స్కూల్ కి వెళ్తుంటే
నేను కూడా ఆ సైకిలు నేర్చుకొని స్కూల్ కి వెళ్ళాలి అనుకున్నాను..
ప్రతి రోజు సాయంత్రం వేళ మా చెల్లి , తమ్ముడు లతో కలిసి సైకిల్ నేర్చుకోనే వాళ్ళం..
అలా ఒక గంట సేపు సైకిల్ మీద తిరిగే వాళ్ళం..
నాకు సైకిల్ మీద తిరగడం అంటే ఇష్టం..
మా నాన్న సైకిల్ మీద మమ్మల్ని బయటకు తీసుకుని వెళ్లేవారు…
అప్పుడు నుండి ఒక పట్టుదలతో సైకిల్ నేర్చుకుని
నా స్నేహితులతో స్కూల్ కి వెళ్ళే వాళ్ళం..
సాయంత్రం వచ్చేటప్పుడు జామ తోటలకు వెళ్లి
ఎవరికి కనిపించకుండా ఆ జామ పండ్లను దొంగతనంగా తీసుకునే వాళ్ళం..
ఇలాంటి అల్లరి చేష్టలు , చిన్న దొంగతనాలు చేసేవాళ్ళం…
ఈ సైకిల్ తో ఎన్నో జ్ఞాపకాలు గుర్తుకొచ్చి నవ్వుకుంటున్నాను..
సైకిల్ తో నాకు జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేదు..

మాధవి కాళ్ల

best telugu stories for kids

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *