భామా కలాపం మూవీ రివ్యూ

భామా కలాపం మూవీ రివ్యూ

ప్రియమణి నటించిన, డైరెక్ట్ గా అహ లో రిలీజైన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

కథ:- ఒక మధ్యతరగతి మహిళ అ ఇంట్లోనే ఉంటూ, తన భర్త తన బిడ్డతో జీవిస్తూ ఉంటుంది. ఆమె తన తీరిక సమయంలో అనుపమ గుమ గుమ అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాంట్లో వంటలు చేస్తూ ఉంటుంది.

తను బాగా ఫేమస్ అవ్వడం వల్ల తనకి సిల్వర్ ప్లే బటన్ కూడా వస్తుంది… అంతే కాకుండా తన చుట్టు పక్క ఇళ్ళల్లో ఏం జరుగుతుందో తమ ఇళ్ళల్లో పనిచేసే ఒక కామన్ పని మనిషి ద్వారా తెలుసుకుంటూ ఉంటుంది…

అలా ఒకసారి పక్క బ్లాక్ లో ఉంటున్న సైరా కి తన భర్త కి ఏదో గొడవ ఉందని తెలుసుకుంటుంది… ఒకరి ఎఫైర్ గురించి బయట పెట్టే విషయంలో నింద పడిన అనుపమ ఈ విషయంలో ఎలాగైనా అందరి నమ్మకం పొందాలని అనుకుంటుంది.

మరొకవైపు ఒక డాన్ ఆరు నెలలుగా ఒక ప్లాన్ వేసి ముంబైలో ఉన్న ఒక గుడ్డు ని దొంగలించారు అని ట్రై చేస్తాడు. ఆ గుడ్డుని అమ్మితే 200 కోట్లు వస్తాయని తనకి తెలుసు. అందుకోసం ఆ గుడిని తన మనుషులతో ఒకరి దగ్గరికి పంపించి డబ్బు తీసుకు రమ్మని చెబుతాడు.

కానీ వాళ్లు మాత్రం ఆ గుడ్డుని మిస్ చేస్తారు. ఆ గుడ్డు సైరా భర్త కి దొరుకుతుంది… కానీ తను మాత్రం వాళ్ల మనుషులకి అబద్దం చెప్పి దాన్ని ఇంట్లోనే దాచిపెడతాడు. మరొకవైపు అనుపమా సైరా వాళ్ల ఇంటి తాళం దొంగలించి ఒక డూప్లికేట్ తాళం తయారు చేస్తుంది…

ఎవరూ చూడని సమయంలో వాళ్ల ఇంటికి. వెళ్లి వాళ్ళ గొడవకి కారణం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటుంది… అదే సమయంలో ఆ గుడ్డు కోసం విలన్ మనుషి వస్తాడు. అతను అనుపమ నీ చూసి తనని చంపాలని చూస్తాడు..

కానీ అనుపమ బై మిస్టేక్ తనని ఫోర్క్ తో చంపేస్తుంది… దాంతో తను ఆ కేసులో ఇరుక్కుంటుంది…. ఇక అనుపమ ఆ కేస్ నుండి ఎలా బయట పడింది?

ఆ డాన్ కి గుడ్డు ఎలా ఇచ్చింది? అసలు సైరా కి తన భర్తకి ఉన్న గొడవ ఎంటి? ఇంతకీ అనుపమ పోలీస్ లకి దొరికిందా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే….

విశ్లేషణ:- నిజానికి ఇదొక క్రైమ్ డ్రామా. సినిమాలో ముఖ్యమైన క్యారెక్టర్ అయిన అనుపమ ప్రాబ్లం లో పడటానికి చాలా సమయం తీసుకున్నారు. అక్కడి వరకు మనకు కొంచెం బోర్ కొట్టినా కూడా ఆ తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్గా నడిపించారు. కానీ బిల్డప్ అన్న పేరుతో ల్యాగ్ ని ఎక్కువ చేశారు.

అనుపమ క్యారెక్టర్ని ఎంత అమాయకంగా డిజైన్ చేశారు అంటే సినిమా ఎండింగ్ వరకు కూడా తను ఒకతన్ని చంపింది అని అస్సలు ఒప్పుకోదు.

నేను పొడిచిన తర్వాత అతను చనిపోయాడు అని చాలా అమాయకంగా మాట్లాడుతూ ఉంటుంది కానీ ఒక సాధారణ గృహిణి ఒక తల్లిని చంపిన తప్పు కి గిల్ట్ గా అస్సలు ఫీల్ అవ్వదు…. ఒక్కసారి ఏడిస్తే చాలు అని అనుకున్నారో ఏమో…

చికెన్ ముక్కలను కోసినంత సులువుగా పోలీస్ ల నుండి తప్పించుకోవడానికి కాలును కూడా నరికేస్తుంది… అలాగే ఎలాంటి లాజిక్స్ లేని ఈ సినిమాలో ఒక డూప్లికేట్ కీ నీ పది నిమిషాల్లో తయారు చేసేశారు…

అలాగే సి సి కెమెరాల్లో రికార్డయిన ఫుటేజ్ ఎవరో దొంగిలించారు అని చెప్పారు కానీ ఎవరు తీసుకున్నారో చెప్పలేదు… అయినా ఒక అపార్ట్ మెంట్ అన్నాక ఒక్క సి సి కెమెరానే ఉంటుందా?? ఈ మధ్య కాలం లో ఎంత పాత అపార్ట్ మెంట్ లో అయినా మినిమం 4,5 సీ సీ కెమెరాలు ఉంటున్నాయి…. ఆ లాజిక్ పక్కన పెట్టి మిగితావాటిపై దృష్టి పెట్టారు… పోనీ వాటినన్నా సరిగ్గా చేశారంటే అదీ లేదు…

అలాగే డానియెల్ బాబు దేవుడు వస్తె అందరి కష్టాలు తీరుతాయి అని నమ్ముతూ ఉంటాడు… అలాంటి వాడు తనకి కష్టం వచ్చేసరికి ప్రగ్నెంట్ గా ఉన్న పోలీస్ నీ చంపేస్తాడు… అసలు ఆ పోలీస్ ఆఫీసర్ నీ ఎందుకు ప్రెగ్నెంట్ చేశారో తెలియదు…

అనుపమ విషయానికి వస్తె తన పని మనిషి భయపడినంత కూడా తనకి భయం ఉండదు ఒక ప్రొఫెషనల్ కిల్లర్ లాగా ప్లాన్స్ వేస్తూ ఉంటుంది… ఇక ఆ డాన్ అయితే కూర్చున్న దగ్గరినుండి లేవకుండా తన మనుషులతో పనులు చేయిస్తూ ఉంటాడు…

వాళ్ల మనుషుల్లో ఒక్కరికీ పని రాదని తెలిసినా అలా చేయించడం తన తప్పే అవుతుందని తెలుసుకోడెందుకో…. ఒక్క రోజులో జరిగే ఈ సినిమాని రెండు గంటలు చూడడం అంటే మన సహనాన్ని పరీక్షించడమే అవుతుంది…

చివరగా:- మొదట్లో ఉన్న కామెడీకి, కొంచం ఇంటరెస్టింగ్ సీన్స్ కి, అక్కడక్కడా వచ్చే హాంటింగ్ మ్యూజిక్ కి ఒకసారి చూడొచ్చు… నిజానికి ఈ సినిమాకు,పెట్టిన పేరు కు న్యాయం చేయలేదు

పంచ్ లైన్:- హాల్ఫ్ బాయిల్డ్ ఎగ్

రేటింగ్:-  2/5

– ప్రణవ్

Related Posts