భారమైన బాల్యం

భారమైన బాల్యం

అల్లారుముద్దుగా పెరగాల్సిన బాల్యం..
అజరామరంగా అలరించాల్సిన బాల్యం..
కష్టసుఖాల కడలిలో ఈదుతున్న బాల్యం..
శ్రమకు ఆహరమైన బాల్యం..
అన్నపానీయాలు నోచని బాల్యం.
చేయూత కు కరువైన బాల్యం..
భారమైన బరువుకు బలైన బాల్యం.
రాళ్ళు రప్ప ల మధ్య నలిగిపోతున్న బాల్యం..
కర్మాగారాల పాలైన బాల్యం.

ఇంతలా భావి భారతాన్ని హరిస్తున్న ఈ బూటకపు సమాజం తప్పక చెల్లించును మూల్యం..

– కిరీటి పుత్ర రామకూరి

Related Posts