భారంగా మారిన భాల్యం

భారంగా మారిన భాల్యం

ఎవర్ని ప్రశ్నించను?
ఏమని ప్రశ్నించను?
బలపం పట్టి, బడి బాట లేని…

బరువుగా ఉండే బండ బలి కోరె?
ఎవర్ని అడగను? ఏమని అడగను?
పాదం దాటని చిక్కు ముళ్ల కంచెల్లో… నా పుట్టుకను ఇచ్చిన పుడమిని అడగనా?
బడి బాట లేని బాల్యమా……

బంధాలు, బాధ్యతలు తెలియని పని బంధమా …

అద్దాల మేడలను అడగనా?
అంతరిక్ష క్షిపణులను అడగనా?
నల్లమబ్బుల్లో దాగి నేలను జారిన చినుకును అడగనా?
బాల్యం అనే చిగురుటాకులు తెంపేసినా… పరిస్థితుల కథనంలో కథగా మారిన నాయి స్థితికి కారకులు ఎవరు?

చెరగని చిరునవ్వు చేరే రోజు ఏది?

బడి బాట పట్టి ప్రయాణ పర్వదిన రోజు ఏది? నా చిట్టి చేతులు ఆడే చక్కని ఆటలు…..

వేచి చూసే నా కంటిపాపలు…

కలవరి పడి కడుపును చీల్చి
కన్నవారి కలలకు పునాది పేర్చి…
పరవసించే పసిపాపల పర్వదినం….
మాయని మల్లె వంటి మనస్సుతో కోండ చారాల్లో జారిపడే జలపాతంలా…
కల్మషం లేని కంటిపాపలా బోసినవ్వులు నెహ్రూ గారి జన్మదిన పర్వదినం.

అంతయై ఇంతయై ఆకాశం అంతమై ఆశా జ్యోతుల మారి, మారుతున్న, మారబోతున్న నేటి బాలలే రేపటి పౌరులుగా….

భరత, బారత, భాగవతాలు రానున్న కాలానికి భవ్యచరితలుగా తీర్చిదిద్దే పుట్టగొడుగులు…
రానున్న కాలం రాకెటు కాలంగా మార్చే రత్నాలు నేటిబాలలు…..

గగన వీధుల్లో గర్వించే గమ్య గనులు…..
భువిని ఏలే ధృవ తారలు….
నేటి బాలలే రేపటి పౌరులు…

– తోగరాపు దేవి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress