భారతదేశ గొప్పతనం

భారతదేశ గొప్పతనం

భారతదేశ గొప్పతనం

భారతదేశం మనభారతదేశం
వేదాలు వెలసిన వేదభూమి
కర్మ సిద్ధాంతం నమ్మిన కర్మభూమి
సంస్కృతి సమ్మేళనాల
సహజత్వం భారతదేశం
సందేశాల శాంతి నిలయం
అహింసా ధర్మాన్ని చాటిన
ఆదర్శ దేశం
మహాత్ముల జన్మస్థలం
ప్రజాస్వామ్య రాజ్యాంగం
కుల మతాల కుగ్రామం
విజ్ఞానపు ఘనులు
వినోదాల ప్రపంచం
సస్యశ్యామల సౌభాగ్యం
వైజ్ఞానిక శక్తి పదం
విశిష్ట కట్టడాల అద్భుతం
జీవనదుల పుణ్య నదుల
ప్రవాహం
ధీర మహిళలే గర్వకారణం
దానధర్మాల అమృతకలశం
భాష యాసల భావమాధుర్యం
యోధుల యోగుల జన్మస్థలం
వజ్రవైఢూర్యాల వైభోగం
అన్నదాతల పవిత్ర స్థలం
ప్రగతి పదానికి అతిరధులు
విజయ రహస్యాల సోపానం భారతదేశం
విశ్వశాంతి గీతాన్ని శాంతి సామరస్యాలకోసమై ఉపదేశించిన ఘనచరిత్ర భరతావనిది
భరతమాత ముద్దుబిడ్డలుగా జన్మించిన మన అందరిదీ గొప్పతనం…

– జి జయ

అన్వేషణ ఎపిసోడ్ 8 Previous post అన్వేషణ ఎపిసోడ్ 8
రైతు గొప్పతనం Next post రైతు గొప్పతనం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *