బాధ్యత

బాధ్యత

బాధ్యత అనేది జవాబుదారీతనంకి నిదర్శనం .

మనచేతిలోని నీళ్ళ గ్లాసు లాంటిది .
గెలుపు ఓటములు మన
బాధ్యత మీదనే వుంటాయి
శ్రద్ధతో బాధ్యతతో చేసే ప్రతిదీ అమోఘం గా ఉంటుంది.
కృషి శ్రమ నాణ్యత విలువలు ఆసక్తి పేరు
ధర్మం అన్నిటినీ కలబోసిన
ఒక నెరవేర్చే సంకల్పం .

సృష్టి ధర్మాన్ని బాధ్యతగా
నిర్వహిస్తుంటే నే అన్ని
అందరికీ అందుతున్నాయి
తల్లి తండ్రులు పిల్లల బాధ్యత సక్రమంగా నిర్వహించాలి
గురువులు విద్యార్థుల కోసం
బాధ్యతగా భావించాలి
ఉద్యోగి వ్యవస్థకు బాధ్యతగా
భావించాలి
నాయకులకు ప్రజల శ్రేయస్సు బాధ్యత నెరవేర్చాలి.
కుటుంబం బాధ్యత
ఆదర్శంగా నిలవాలి

అదృష్టం కలిసి వస్తుందని
బాధ్యతారహితంగా వున్నవారికి ఫలితాలను
ఆశించవడ్డు

ఆలోచనలను ప్రణాళిక
బద్దంగా పట్టుదలతో ముందుకు సాగిపోవాలి

అన్నిటికంటే ముఖ్యమైనది
సమాజంలో ఎవరికి వారుగా దేశ పౌరులుగా
బాధ్యతగా వుండాలి .

బాధ్యత బరువు ఎంత
అనేది మనకు మనంగా
డిజైన్ చేస్కోవాలి …..

– జి జయ

Previous post పేరు పెట్టకు మేలు!!
Next post రాజు-బంటు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *