భక్తి కాలం

 

ఎందరోమహానుభావులు

 

మనకు తెలిసిన ఎందరో భక్తాగ్రేసరులు అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ, కైవార తాతయ్య ఇలా ఎందరో ముందుగా నృసింహ ఉపాసకులై తద్వారా వేంకటేశుని సన్నిధి చేరి కైవల్యం పొందారు.

అన్నమయ్య ఆయన రాసిన 32 వేల సంకీర్తనలలో వేంకటేశుని తరువాత అంత ఆర్ద్రంగా రాసిన కీర్తనలు నృసింహుని పైనే.

అసలు ఇంత అభేధ్యం వారికి ఎలా నిరూపించారో మనం శ్రీనివాసుని కళ్యాణ ఘట్టాన్ని నెమరు వేసుకుంటే అర్ధమవుతుంది.

శ్రీనివాసుడు దేవతలను అందరినీ ఆయన కళ్యాణానికి పిలిచి వారందరికీ తగిన ఏర్పాట్లు చెయ్యడానికి కుబేరుని దగ్గర 14లక్షల రామముద్ర గల సువర్ణనాణములు చతుర్ముఖుడు, రుద్రుడు, అశ్వత్థవృక్ష సాక్షిగా ఋణం తీసుకుంటాడు.

ఒకొక్క తీర్ధ, సరోవరాలలో వంటలు వండబడ్డాయి. బ్రహ్మదేవుడు ముందుగా దేవునికి నివేదన చెయ్యకుండా మిగిలిన వారికి ఎలా వడ్డించేది అని అడుగుతాడు శ్రీనివాసుని. కనుక ముందు నీవు ఆరగింపమని ప్రార్ధిస్తాడు. నా ఇంటి శుభకార్యానికి వచ్చిన వీరంతా అతిధులు కావున వారికి భోజనం పెట్టకుండా నేను భుజించడం ధర్మ విరుద్ధం అంటాడు. కానీ నివేదన చెయ్యని భోజనం దేవతలు, ముని, ఋషి బ్రాహ్మణులు తినరే ఎలా అని బ్రహ్మ వ్యాకుల పడగా శ్రీనివాసుడు, నేను మరొక రూపంలో నరసింహునిగా అహోబిలంలో ఉన్నాను. కనుక ముందు అక్కడ నివేదన చెయ్యమని చెబుతాడు శ్రీనివాసుడు. ఆ తరువాతే అందరికీ ఆ నైవేద్యం వడ్డించబడింది.

అందుకే తిరుమలలో కూడా యోగముద్రలో ఉన్న యోగ నృసింహుడు ఆ గుడి ప్రాంగణంలో స్వామికి అభేదంగా ఉంటారు. యోగులు ఆ యోగ నృసిమ్హుని ముందు కూర్చుని ధ్యానిస్తే ఆనందనిలయంలో ఉన్న ప్రత్యక్ష శ్రీనివాసుని దర్శనం అవుతుందని పెద్దలు చెబుతారు.

అందుకే వెంకటేశ్వరపాదసేవలో నృసిమ్హునికి అంత ప్రాముఖ్యం. స్వామీ నైవేద్యం పుచ్చుకునేటప్పుడు భక్తులు ఈ శ్లోకం చెప్పుకోవడం కద్దు

“రమాబ్రహ్మాద యోదేవాః సనకాద్యాఃశుకాదయ: !
శ్రీనృసింహప్రసాదోయం సర్వే గృహ్ణ౦తు వైష్ణవా: !! “
మాతా నృసింహశ్చ పితానృసింహ: సఖానృసింహశ్చ భ్రాతా నృసింహ విద్యానృసింహో ద్రవిణం నృసింహ: స్వామి నృసింహ సకలం నృసింహ

🙏 *శ్రీ నృసింహ జయన్తీ శుభాకాంక్షలు* 💐

ఓం పరమాత్మనే నమ: & ఓం నమ: శివాయ:
*రేపు శని త్రయోదశి*

*🌼🌸🌱 శని త్రయోదశి విశిష్టత 🌱🌸🌼*

త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శనివారం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు. అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం.అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పెద్దలు పేర్కొంటారు. శని జన్మించిన తిథి కూడా త్రయోదశి అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమశని.. తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుందని పెద్దలు చెబుతారు.

శనివారం నాడు శ్రీమహాలక్ష్మీ, నారాయణుడు అశ్వత్థవృక్షంపై ఉంటారని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే ఆ రోజున అశ్వత్థవృక్ష సందర్శన, ప్రదక్షిణ చేయాలి. శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి. కాకికి నైవేద్యం పెట్టాలి. నల్లనువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రంలో ఉంచి దానం చేయాలి.

🌺🌸🌺 శని బాధలు తీరేందుకు ఇలా స్తోత్రం చేయాలి 🌺🌸🌺

‘‘నీలాంజన సమాభాసం.. రవిపుత్రం యమాగ్రజమ్‌..
ఛాయా మార్తాండ సంభూతం.. తం నమామి శనైశ్చరమ్‌’’

శని త్రయోదశి: కేవలం శనిదేవుడి ఆరాధనకే కాదు..!

భారతీయులు కర్మ సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతారు. ముఖ్యంగా హిందువులకు కర్మ సిద్ధాంతంపై నమ్మకం ఎక్కువ. దీని ప్రకారం మనిషి చేసే కర్మలకు ప్రతిఫలం అనుభవించి తీరాలి. మంచి కర్మలకి మంచి ప్రతిఫలం, చెడు కర్మలకి చెడు ప్రతిఫలం అనుభవించి తీరాలి. ఈ బాధ్యతలను శనీశ్వరుడికి పరమేశ్వరుడు అప్పగించాడు. అందుకే ఆయనను కర్మ ఫలదాత అంటారు. ఒడిదొడుకులు ఎదురైనప్పుడే జీవితం విలువ గురించి తెలుస్తుంది. మనిషికి అప్పుడప్పుడూ మొట్టికాయలు వేస్తూ లోపాలను సరిదిద్దేది శనిదేవుడు. ప్రాణాలతో ఉన్నప్పుడు వారి పాపాలకు తగిన ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తాడు.

సూర్యభగవానుడు, ఛాయా సంతానమే శనిదేవుడు. అందుకే ఆయనను సూర్యపుత్రడు అనీ, ఛాయాసుతుడు అనీ అంటారు. నవ గ్రహాల్లో కీలకమైన శని.. జాతక చక్రంలోని ఒక్కో రాశిలో దాదాపు రెండున్నర ఏళ్లు సంచరిస్తాడు. అంటే రాశి చక్రంలో ఒకసారి ప్రయాణానికి దాదాపు 30 ఏళ్లు పడుతుంది. నిదానంగా సంచరిస్తాడు కాబట్టి శనికి మందగమనుడు అనే పేరు ఉంది. అయితే, రాశిచక్రంలో ఆయన ఉండే స్థానాన్ని బట్టి ఫలితాలు కూడా ఉంటాయి. జాతకరీత్యా శని ప్రభావం అధికంగా ఉన్నప్పుడు తమకు తక్కువ శ్రమ కలిగించాలని శనీశ్వరుని వేడుకుంటారు. అందుకోసం నవగ్రహాలు ఉండే ఆలయాన్ని దర్శిస్తారు. ఇక త్రయోదశి తిథి వచ్చే శనివారం నాడు ఆయనను పూజిస్తే మరింత త్వరగా ఉపశమనం కలిగిస్తాడని నమ్మకం. అయితే, శని త్రయోదశికి ఎంతో విశిష్టత ఉంది. శనివారం శని భగవానునికీ, అటు విష్ణుమూర్తికీ ప్రీతికరమైన రోజు కాగా, త్రయోదశి శివునికి ఇష్టమైన తిథి.

స్థితి, లయకారులిద్దరికీ ఇష్టమైన రోజుగా శనిత్రయోదశి స్థిరపడింది. దీని ప్రాముఖ్యతని మరింతగా వివరించేలా ఒక పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. ఒకసారి కైలాసానికి వెళ్లిన నారద మహర్షి శనీశ్వరుడి గురించి పొగడటం మొదలుపెట్టాడు. ఎంతటివారైనా శని ప్రభావం నుంచి తప్పించుకోలేరన్నాడు. ఈ మాటలకు ఆగ్రహించిన శివుడి.. ‘శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా, నా మీద మాత్రం పనిచేయదు’ అని అన్నాడు. ఇదే మాటను నారదుడు యథాతథంగా శనిదేవుని వద్దకు మోసుకువెళ్లాడు.‘నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు. ఇది సృష్టి ధర్మం,’అని చెప్పిన శని.. పరమేశ్వరుని ఫలానా సమయంలో పట్టిపీడించి తీరతానని అన్నాడు.శని శపథం గురించి విన్న శివుడికి ఏం చేయాలో అర్థంకాక, మాట నెరవేరితే తన ప్రతిష్ఠకే భంగం కలుగుతుందని భావించాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలో ఒక చెట్టు తొర్రలో దాక్కొన్నాడు.

మర్నాడు కైలాసానికి వచ్చిన శనిదేవుడిని చూసిన శివుడు ‘నన్ను పట్టి పీడిస్తానన్న నీ శపథం ఏమైంది’ అంటూ పరిహసించాడు. దీనికి శని ‘ప్రభూ! ఈ ముల్లోకాలకూ లయకారుడవైన నువ్వు ఆ చెట్టు తొర్రలో దాక్కొన్నావే! అది నా ప్రభావం కాదా. దీన్ని శని పట్టడం అనరా?’ అన్నాడు. శనిదేవుని శక్తిని గ్రహించిన పరమేశ్వరుడు.. ఈ రోజు నుంచి శనిత్రయోదశి నాడు ఎవరైతే నిన్ను పూజిస్తారో వారికి నీ అనుగ్రహంతో పాటు నా అభయం కూడా దక్కుతుందన్నారు. ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా పరఢవిల్లుతావని ఆశీర్వదించాడు. అప్పటి నుంచి త్రయోదశి తిథి వచ్చే శనివారం నాడు నువ్వుల నూనెతో శనీశ్వరుని అభిషేకించి, తమని చూసీచూడనట్లుగా సాగిపొమ్మని వేడుకుంటున్నారు.🙏

🙏🌺ఒకనాడు “శ్రీ మహావిష్ణువు” దర్శనం కోసం “వాయుదేవుడు” వైకుంఠానికి వచ్చాడు🌺🙏

🌺ఆదిశేషువు వాయుదేవుడిని అడ్డగించి “మహావిష్ణువు పడుకుని ఉన్నారు, ఇప్పుడు కలవడానికి వీల్లేదు” అని చెప్పాడు.
వాయుదేవునికి కోపం వచ్చింది.
ఆదిశేషువుతో యుద్దం చేశాడు.
ఇంతలో “విష్ణుమూర్తి”లేచి వచ్చారు.
ఇద్దరూ, ఎవరికి వారే తమ గొప్పతనం చెప్పుకున్నారు.🌺

🌺మహావిష్ణువు ఆదిశేషుడు, వాయుదేవునికి పరీక్ష పెట్టాడు. ఆదిశేషువుతో
మేరు” పర్వతానికి ఉత్తర దిక్కులో ఉన్న
ఆనంద పర్వతాన్ని గట్టిగా చుట్టి పట్టుకోమన్నాడు. వాయుదేవుని వైపు తిరిగి బలప్రయోగం చేసి,
ఆ పర్వతాన్ని అక్కణ్ణించి కదిలించమని చెప్పాడు.

ఆ పరీక్షకు విశ్వమంతా ఆశ్చర్యపోయింది. అల్లకల్లోలం చెందింది.
దేవతల మాట విని ఆదిశేషువు “ఆనంద పర్వతం” మీద పట్టు సడలించి పరీక్ష నుండి తప్పుకున్నాడు. దాంతో ఆనంద పర్వతం వాయువు ప్రభావంతో ఒక్క ఉదుటున వెళ్ళి “సువర్ణముఖి” నది ఒడ్డున పడింది. ఇది చూసి ఆదిశేషుడు బాధ పడ్డాడు.🌺

🌺బరహ్మదేవుడు, ఆదిశేషునితో
“నిన్ను వెంకటాద్రితో విలీనం చేస్తాను.
ఈ వెంకటాద్రిపై శ్రీ మహావిష్ణువు “వేంకటేశ్వరుని”గా అవతరించనున్నాడు” అని చెప్పాడు.

అదీ సంగతి.
“నల్లమల” కొండలను “ఆదిశేషుని”గా భావిస్తారు. ఆదిశేషుడు వెంకటాద్రిలో విలీనం అయ్యాడు. తిరుమలలో మొదలై, శ్రీశైలంలో అంతమౌతుంది.

“ఆదిశేషువు” “పడగ” భాగం తిరుమల
శ్రీ వెంకటేశ్వర స్వామి
శేషువు మధ్య భాగం “అహోబిలం” శ్రీ నరసింహ స్వామి
తోక భాగం “శ్రీశైలం” “మల్లికార్జున స్వామి” వెలిశారు.🌺

🌺ఏడు కొండల పేర్లు వరుసగా “అంజనాద్రి”, “గరుడాద్రి”, “నారాయణాద్రి”, “నీలాద్రి”,
“శేషాద్రి”, “వెంకటాద్రి”, “వృషభాద్రి”.
ఆ ఏడు కొండలు సాలగ్రామాలే. ఆ ఏడు కొండలూ మహర్షులే. అక్కడి చెట్లు, పుట్టలు, పక్షులు ఏవైనా మహర్షుల అంశలే. తిరుమలలో పుట్టింది ఏదీ సామాన్యమైనది కాదు.

అంజనాద్రి ర్వ్రుశాద్రిశ్చ శేషాద్రిర్గరుడాచలః |
తీర్థాద్రిః శ్రీనివాసాద్రి శ్చింతామణిగిరిస్తథా ||
వృషభాద్రి ర్వరాహాద్రిః జ్ణానాద్రిః కనకాచలః |
ఆనందాద్రిశ్చ నీలాద్రి స్సుమేరుశిఖరాచలః ||
వైకుంఠాద్రి: పుష్కరాద్రిః — ఇతి నామాని వింశతిః

 

సేకరణ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress