భారతి తొమ్మిదో భాగం

భారతి తొమ్మిదో భాగం

 

తాము అనుకున్నట్టుగానే భారతి, మనోజ్ ల పెళ్ళి జరిగిపోయింది. ఇద్దరి తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు వాళ్ళ పెళ్ళి చూసి, ఇక మనోజ్ తల్లిదండ్రులు అయితే చాలా ఆనందంగా ఉన్నారు.

ఎందుకంటే రాడు అనుకున్న కొడుకు రావడం అది కూడా చిన్ననాటి స్నేహితురాలి ద్వారా దొరకడం ఆమెను పెళ్ళి చేసుకునీ ఇంటి పట్టున ఉండడం తమ తో ఆనందంగా గడపడం ఇద్దారు భార్యా భర్తలు చిలకా గోరిoకల్లా తమ కళ్ళ ముందే ఉండడం తో వారి ఆనందానికి హద్దులు లేవు.

ఇక భారతి తల్లిదండ్రులు కూడా భారతి చిన్న నాటి నుండి తెలిసిన వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేయాలి అని అనుకున్నారు కానీ చదువు అని చదువులో పడిన తర్వాత ఆమె ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి చేయాలనీ అనుకున్నారు ఆ తర్వాత భారతి మనోజ్ ను ప్రేమిస్తున్నా అని మనోజ్ తల్లిదండ్రులకు చెప్పగానే తమ కూతురు ప్రేమను గుర్తించి అడ్డు చెప్పకూడదని అనుకున్నారు కాబట్టి ఇప్పుడా కొత్త జంటను చూసి సంతోష పడుతున్నారు. వారికీ ఇప్పుడు కావాల్సింది ఆడుకోవడానికి మనుమడు అంతే ..

మరి అలాంటి సంతోషం లో ఉన్న ఆ వృద్దులకు ఇప్పడు భారతి, మనోజ్ ల నిర్ణయం వారికి తెలిస్తే ఎలాంటి ఉపద్రవం తెస్తుంది  ఇక చదవండి…

భారతి , మనోజ్ లకు ఆరు నెలల కాలం అరక్షణం లా గడిచిపోయాయి కొత్త దంపతులకు ఆరు నెలల కాలంలో ఒకరిని విడిచి ఒకరు ఉండకుండా ఎప్పుడు గలగలా నవ్వుతూ సంతోషంగా తిరుగుతూ ఆనందమంతా తమలోనే తమ తోనే ఉంది అన్నట్టు గా ఉన్నారు తను మళ్ళీ వెళ్తాను అనే విషయం మాత్రం ఎవరికీ చెప్పలేదు వీళ్ళిద్దర్నీ చూసి ఇద్దరు తల్లిదండ్రులు స్నేహితులు సంతోషించారు బాగున్నారని సంబరపడ్డారు. తమ కొడుకు తమతోనే ఉంటాడని అంతా సంతోషపడ్డారు.

ఇంతలో.. ఒక రోజు  రాత్రి గది లోకి వెళ్తున్న భారతి ఒక్క సారిగా కళ్ళు తిరిగి పడిపోయింది. అదెవరు గమనించలేదు ఎవరి గదుల్లో వాళ్ళు పడుకున్నారు. అయితే మనోజ్ భారతి ఇంకా రావడం లేదని వెళ్లి చూసేసరికి భారతి కిందపడిపోయి కనిపించింది దాంతో భారతి అంటూ ఒక్కసారిగా బిగ్గరగా అరవడం తో అందరూ గబగబా పరుగెత్తి వచ్చేసరికి మనోజ్ భారతి ని తీసుకుని వెళ్లి అక్కడే ఉన్న దివాన్ పైన పడుకోబెట్టాడు.

ఏమయ్యింది రా మనోజ్ అంటూ తల్లి ఏంటి బాబు ఏమైంది అంటూ అత్తగారు అడిగే సరికి ఏమో అత్తయ్య తానూ నీళ్ళ కోసం కిందికి వచ్చింది. ఇంకా రావడం లేదని నేను వచ్చి చూసేసరికి ఇదిగో ఇలా పడి ఉంది అన్నాడు మనోజ్. సరే మాటలు తర్వాత ముందు వెళ్లి డాక్టర్ గారికి ఫోన్ చెయ్యి అన్నాడు మనోజ్ తండ్రి తనకు ఆ ఆలోచన రానందుకు తిట్టుకుంటూ వెళ్లి ఫోన్ తీసుకుని వచ్చి ఫోన్ చేయడం తో అరగంటలో వచ్చారు డాక్టర్ గారు.

డాక్టర్ వచ్చేవరకు భారతి కి పరిచర్యలు చేస్తున్నారు అందరూ ఇక మనోజ్ అయితే కాలుగాలిన పిల్లి లా తిరుగుతూ ఉన్నాడు. డాక్టర్ కారు రావడం తోనే  మనోజ్ వెళ్లి డాక్టర్ గారు ఏమయ్యిందో తొందరగా చూడండి అంటూ హడవుడి  పెట్టేసరికి అగు బాబు అంత తొందర ఎందుకు ?  ఆగవయ్యా అంటూ వెళ్లి అందర్నీ జరగమని అంటూ గాలి తగిలేలా చేసి, అన్ని పరిక్షలు చేసారు.

డాక్టర్ గారు ఏం చెప్తారా అని అందరూ ఉత్కoటగా చూస్తున్నారు దాంతో డాక్టర్ గారు ఏం లేదయ్యా మీరు ఎందుకంత భయపడుతున్నారు మీ పని పట్టడానికి, నీ మీసాలు లాగడానికి ఒక బుడ్డోడు మీ ఇంటికి రాబోతున్నాడు ఇక కాసుకోండి అంటూ చెప్పేసరికి ముందు ఎవరికీ అర్ధం కాలేదు.

ఏంటయ్యా చెప్పేది ఎదో సరిగ్గా చెప్పి చావు అన్నారు మనోజ్ తండ్రి గారు తన పాత స్నేహితుడే కాబట్టి దాంతో డాక్టర్ నవ్వుతూ ఒరేయి ఒరేయి నేను చెప్పి చావడం కాదురా వెధవ నిన్ను చావగొట్టే నీ మనుమడు రాబోతున్నాడు ఇక కాసుకో అంటూ నవ్వడం తో అందరికి విషయం అర్ధం అయ్యింది.

ఇక అందరూ అవునా అంటూ సంతోష పడ్డారు. ఇంతలో భారతి సృహ లోకి రావడం గమనించిన తల్లి అమ్మా భారతి అంటూ దగ్గరికి వెళ్లి ఎంత సంతోషకరమైన వార్త చెప్పవో తెలుసా ఆగు నీ నోటిని తీపి చేస్తాను అంటూ వంటింటిలోకి వెళ్లి శక్కరి తెచ్చి భార్య భర్తలకు తినిపించారు అలాగే ఒకరికి ఒకరు శక్కరి  తినిపించుకున్నారు.

******

Royalty-free indian lady photos free download | Pxfuel

భారతీ ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసింది అందరూ ఇంకా సంతోషంతో ఉన్నారు.  కానీ భారతి మాత్రం ఆందోళన చెందుతూ ఉంది మనసులో కానీ బయటకు మాత్రం కనిపించనివ్వలేదు.  తానూ  తల్లిని కాబోతున్నందుకు  సంతోష పడాలో, తన భర్త తనకు దూరంగా వెళ్తాడు అనే నిజాన్ని ఎలా జీర్ణించుకోవాలో భారతికి అర్ధం కావడం లేదు. మనసంతా ఏదో దిగులుగా ఉంది తను ఎంత కంట్రోల్ చేసుకుందమన్నా ఆగకుండా కన్నీరు వస్తుంది, కానీ పెద్దల ముందు బయటపడడం ఎందుకని ఊరుకుంది వాళ్ళకు తన కన్నీరు కనపడకుండా దాచింది.

ఇక  ఆ రాత్రి  మనోజ్ భారతి తో “ భారతి నువ్వు కోరుకున్న విధంగా నీకు కొడుకును ప్రసాదించాను ఇక సెలవు అయిపోయింది నేను ఇంకో నాలుగు రోజులలో వెళ్లిపోవాలి నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పడంతో భారతి ఏడవసాగింది. అదేంటి భారతి  అన్నీ నీకు చెప్పిన తర్వాతే కదా మనం భార్యభర్తల మాయ్యం మళ్ళి ఈ ఏడుపు ఎందుకు “ అని అనగానే నేను దానికి ఏడవడం లేదండి మీరు బిడ్డ పుట్టే ఎవరికైనా ఉంటారేమో అని అనుకున్నాను కానీ మీరు నాలుగు రోజుల్లో వెళ్తాను అని అంటున్నారు.

కనీసం  నేను డెలివరి అయ్యేవరకైనా ఉంటారని నా ఆశ అలా ఉండడం కుదురుతుందా అని అడిగింది. లేదు భారతి అలా ఉండడం కుదరదు బిడ్డ పుట్టిన తర్వాత కావాలంటే రెండు నెలలు సెలవు తీసుకొని వస్తాను అని చెప్పాడు మనోజ్. దాంతో భారమైన మనసుతో సరేనని తల ఊపింది భారతి.

నాలుగు రోజులు గడిచాయి ఆరోజు మనోజ్ వెళ్ళవలసిన రోజు మనోజ్ డ్రెస్సు వేసుకుని బట్టలు తీసుకొని మేడ మీద నుంచి కిందికి దిగుతుండగా అత్త మామ తల్లిదండ్రి అంత చూస్తూ విస్తుపోయారు అదేంటి మనోజ్  ఎక్కడికి ప్రయాణం ఇద్దరూ ఎటైనా వెళ్ళాలనుకున్నారా అంటూ అడిగిన వాళ్ళకు లేదు నాన్న నేను మళ్ళి ఉద్యోగం లో చేరడానికి వెళ్తున్నా అన్నాడు మనోజ్.

దానికి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయ్యి అదేంటి నిన్ను మళ్ళి వెళ్ళకుండా  ఇక్కడే ఉండి వ్యాపారం తో పాటూ నీ భార్యా పిల్లల్నిచూసుకో అని చెప్పాము కదా అన్నాడు మనోజ్ తండ్రి దానికి మనోజ్ లేదు నాన్న నేను ఖచ్చితంగా మిలట్రి లోకి వెళ్ళాలి ఇప్పుడు వెళ్లే సమయం వచ్చింది, నా  సెలవు అయిపోయింది అందుకే నేను వెళుతున్నాను అని చెప్పాడు మనోజ్.

అయ్యో పెళ్లి చేసుకున్న అమ్మాయిని, అది కూడా తల్లి కాబోతున్న అమ్మాయిని  ఒంటరిగా వదిలి ఎలా వెళ్తావు భారతి నువ్వైనా నీ భర్తకి చెప్పు వెళ్లొద్దని అని అన్నారు.

దానికి భారతి  లేదు మామయ్యా తను నాకు మనోజ్ ముందే చెప్పాడు వెళ్తాను అని నేను దానికి అంగీకరించిన తర్వాతే  మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం  పైగా ఇప్పుడు నేను బిడ్డ తల్లిని కూడా అవుతున్నాను. దేశసేవ కంటే ముఖ్యం ఏది  కాదు మన దేశంలో పుట్టినందుకు ఎంతో కొంత దేశ సేవ చేయాలి కదా మామయ్య నేను అన్నీ తెలిసే తనని పంపిస్తున్నాను.

An Indian girl - Free Image by World_through_my_lens on PixaHive.com

నేను పుట్టిన కొడుకుని చూసుకుంటూ ఉంటాను, అయినా తను మళ్ళీ రెండు మూడు నెలల్లో తిరిగి వస్తాను అని అన్నారు అందుకే వెళ్తున్నారు అని అనగానే ఇక అందరికి ఏం చేయాలో తెలియక అర్ధం కాక సరే మీరు మీ భార్య భర్తలు ఇష్టం మీ ఇష్టం వచ్చినట్లు చేయండి అనుభవించేది నువ్వు మేము కాదు కదా మీరు పెద్దవాళ్ళు అయ్యారు అని అన్నారు మామయ్య గారు.

అయ్యో మామయ్య  నేను ఏమి బాధ పడడం లేదు నాకు మీరు మీకు నేను ఉన్నాము తను మళ్ళీ వస్తాడు ఇప్పుడే వెళ్తున్నాడు కదా  తప్పకుండా వస్తాడు అని సర్ది చెప్పింది భారతి. దాంతో మనోజ్ ఫ్లైట్ టైం అయ్యింది.

భారతి అంటూ వెళ్లొస్తాను నాన్నగారు అంటూ అందరి ఆశీర్వాదం తీసుకుని జాగ్రత్తగా ఉండు అంటూ భార్యకు చెప్పి వెళ్లొస్తాను సరేనా అని అనగానే భారతి కన్నీళ్ళతో సరే అన్నట్టుగా తల ఊపింది. ఇక అందరూ కలిసి ఎయిర్ పోర్ట్ కి మనోజ్ కి సెండాఫ్ ఇవ్వడానికి వెళ్లారు మనోజ్ దేశ సేవ చేయడానికి వెళ్లిపోయాడు అందరూ భారమైన మనసుతో ఇంటికి తిరిగి  బయలుదేరారు.

మరి అలా వెళ్ళిన మనోజ్ తిరిగి వచ్చాడా ? రాలేదా ? దేశ సేవలో ఏం జరిగింది ? భారతి పండంటి బిడ్డకు జన్మనిచ్చిందా ? లేదా ? చదవండి తదుపరి భాగం లో

Related Posts