"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

భ్రమలో బందీ

భ్రమలో బందీ

ఇంద్ర ధనస్సులాటి
ఇంపైన బాల్యం
ఇ ప్పుడేది?

కార్పొరేట్ స్కూళ్ల
కబంద హస్తాల్లో బందీ
అయిపోయిన బాల్యం
కార్పొరేట్ కోరల్లో
బంగారు బాల్యం
పంజరంలో చిలకలా బందీ

స్మార్ట్ ఫోన్లు రాక ముందు
బాలల బాల్యం బంగారమే
ఇప్పుడు బాలల చేతిలో ఫోన్
ఫోన్ లో మునిగిన బాలలు
చుట్టూ ప్రపంచం తెలుసుకుంటున్నామన్న భ్రమ
అంతా తమకే తెలుసన్న మిడిసి పాటు
మావాడికి బటన్లు నొక్కడం వొచ్చని మురిసే పెద్దలు
కృత్రిమ మురిపాలమధ్య
బంగారు బాల్యం బుగ్గి
ఫోన్ పంజరంలో బంధీంపబడిన
బాల్యం కోల్పోయిన బాలలు
మూల్యం చెల్లించుకోక తప్పదు
తల్లి తండ్రులు మేల్కొనక తప్పదు

– మోటూరి శాంతకుమారి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *